క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గిఫ్టుగా చేప

క్రికెట్ లీగ్ లలో సాధారణంగా రెండు టీమ్ ల మధ్య మ్యాచ్ ముగిసిన తరువాత..ఆ రెండు టీమ్ లలో ఎవరు బాగా ఆడారో వారిని అభినందిస్తూ బోర్డ్ ప్రోత్సాకాల్ని అందిస్తుంది. కానీ కాశ్మీర్ లో జరిగిన క్రికెట్ లీగ్ లో విచిత్ర సంఘటన చోటు చేసింది.

కాశ్మీర్‌లోని టెకిపోరా కుప్వారాలో క్రికెట్ లీగ్‌లో 2.5 కిలోల చేపను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుగా ఇచ్చారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాన్‌కు అవార్డుగా చేపలు ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇటీవల,టెకిపోరా కుప్వారాలో జరిగిన క్రికెట్ మ్యాచ్లో, 2.5 కిలోల చేపను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఇస్తున్న ఫోటోలు నెట్టింట్లో షేర్ అవుతున్నాయి. అయితే చేపల్ని అవార్డ్ గా ఇవ్వాలనే ఆలోచన లీగ్‌ను హైలైట్ చేయడం , క్రికెట్ గ్రౌండ్ దయనీయమైన పరిస్థితిని వివరించేందుకు ఈ పనిచేయాల్సినట్లు తెలుస్తోంది. నేషనల్ మీడియా కథనం ప్రకారం లీగ్ మ్యాచ్ లు ఆడుతున్న ఆటగాళ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఆటగాళ్ళు ఆట ఆడటానికి వారి సొంతనిధుల్ని ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

Latest Updates