హిట్ మ్యాన్ వరల్డ్ రికార్డ్ కు ఐదేళ్లు

ఓపెనర్ గా బరిలోకి దిగినప్పటి నుంచి  రో ‘హిట్‘మ్యాన్ జోరు మామూలుగా లేదు. గత ఐదేళ్లుగా రికార్డుల మీద రికార్డులు తిరగేస్తున్నాడు. టీ20,వన్డే, ఈ మధ్య టెస్టు ఓపెనర్ గానూ అదరగొడుతున్నాడు. సెంచరీ చేయడానికే తంటాలు పడుతున్న ఈ రోజుల్లో రోహిత్ శర్మ వన్డేలో మూడు డబుల్ సెంచరీలు బాది ఔరా అనిపించాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే నవంబర్ 13, 2014 ఈడెన్ గార్డెన్ లో శ్రీలంకతో  జరిగిన వన్డేలో లో రోహిత్ 264 పరుగులతో వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత (264) స్కోరు రోహిత్ శర్మదే. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు రోహిత్. ఈ రికార్డ్ ఇన్నింగ్స్ కు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా  ఐసీసీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates