ఈ ఫేస్‌‌మాస్క్‌‌ ఖరీదు రూ. 25 వేలే.!

కరోనా’ వైరస్‌‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌‌ల వాడకం బాగా పెరిగిపోయింది. రకరకాల మాస్క్‌‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. సాధారణంగా వీటి ధరలు పది నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయి. ఎక్కువ మంది సూచిస్తున్న ‘ఎన్‌‌’ మాస్క్‌‌లు ఈ రేంజ్‌‌లోనే దొరుకుతాయి. అయితే ఇంతకంటే కాస్ట్లీ మాస్క్‌‌లు కూడా ఉన్నాయి. కొన్ని మాస్క్‌‌లు పాతిక వేల రూపాయల వరకు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఖరీదైన మాస్క్‌‌లివి.

ఆఫ్‌‌–వైట్‌‌ మాస్క్‌‌

చూసేందుకు మామూలు మాస్క్‌‌లాగే కనిపించినా, దీని రేట్ మాత్రం మామూలుగా ఉండదు. దాదాపు పదివేల రూపాయలకు దగ్గరగా ఉంది. అమెరికాలోని ఫేమస్‌‌ ఫ్యాషన్‌‌ బ్రాండ్‌‌ ‘ఆఫ్‌‌–వైట్‌‌’ సంస్థ తయారుచేస్తోంది వీటిని. పూర్తిగా కాటన్‌‌తో తయారైన వీటి ధర ఎక్కువగా ఉన్నా, డిమాండ్‌‌కూడా ఎక్కువే. సెలబ్రిటీలు మాత్రమే ‘ఆఫ్‌‌–వైట్‌‌మాస్క్‌‌’లు వాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌‌ యాక్టర్‌‌‌‌ అనిల్‌‌కుమార్‌‌‌‌ ఈ మాస్క్ తొడుక్కుని ప్రెస్‌‌మీట్‌‌కు వచ్చాడు. అప్పట్లో దాని గురించి బాగానే మాట్లాడుకున్నారు.

నైకీ ఫేస్‌‌మాస్క్‌‌

ఫేమస్‌‌ స్పోర్ట్‌‌బ్రాండ్‌‌ ‘నైకీ’ సంస్థ  కూడా ఫేస్‌‌మాస్క్‌‌లు తయారు చేస్తోంది. సాధారణంగానే నైకీ ప్రొడక్ట్స్  కాస్త ఎక్కువ రేట్లు పలుకుతాయి. మాస్కులు కూడా అదే దారిలో ఎక్కువ రేటే ఉన్నాయి.  ‘నైకీ ఎక్స్‌‌ఎమ్‌‌ఎమ్‌‌డబ్ల్యూ’ మాస్క్‌‌ధర దాదాపు పదహారు వేల రూపాయలు.

బలాక్లవా మాస్క్‌‌

మరో ఫేమస్‌‌ బ్రాండ్‌‌‘గుచి’ సంస్థ తయారుచేసిన ‘నిటెడ్‌‌ బలాక్లవా ఫేస్‌‌మాస్క్‌‌’  ధర దాదాపు ఇరవై మూడు వేల రూపాయలుగా ఉంది. ఆన్‌‌లైన్‌‌లో ఈ మాస్క్‌‌ అందుబాటులో ఉంది.

బేప్‌‌మాస్క్‌‌

జపాన్‌‌కు చెందిన బేప్‌‌బ్రాండ్‌‌ తయారు చేస్తున్న ఫేస్‌‌మాస్క్‌‌ ధర దాదాపు పద్నాలుగు వేల రూపాయలు. ప్రస్తుతం డిమాండ్‌‌ పెరగడంతో ధర కూడా పెంచి అమ్ముతున్నారు.

సుప్రీమ్‌‌ మాస్క్‌‌

అమెరికాకు చెందిన ‘సుప్రీమ్‌‌ క్లోతింగ్‌‌’ సంస్థ ఫేస్‌‌మాస్క్‌‌లను తయారు చేస్తోంది. ఈ సంస్థకు చెందిన కొన్ని మాస్క్‌‌లు ఆరు వేల రూపాయల వరకు ఉన్నాయి. ఒకప్పుడు రెండు నుంచి మూడు వేల రూపాయలకే దొరికే రెడ్ కలర్‌‌‌‌ ‘సుప్రీమ్‌‌మాస్క్‌‌’లను ఇప్పుడు ఆరు వేల రూపాయల వరకు అమ్ముతున్నారు.

 

 

Latest Updates