యతి పాదముద్రలు కాదు…ఎలుగుబంటివట

ఇవీ.. యతి పాదముద్రలూ అని ఆర్మీ ప్రకటించింది. దానికి ఆధారాలుగా ఫొటోలనూ ట్వీట్​చేసింది. తేల్చడానికి ల్యాబ్​కు పంపించామని చెప్పింది. ఎహె.. అవన్నీ వట్టి మాటలే అంటోంది నేపాల్​ ఆర్మీ. యతి లేదు.. గితి లేదు.. అవి ఎలుగ్గొడ్డు పాద ముద్రలు అని చెబుతోంది. ‘‘ఇండియన్​ ఆర్మీ పాద ముద్రలను గుర్తించడం నిజమే. వాళ్లతో పాటు మా టీం కూడా ఉంది. అది యతో కాదో తేల్చేందుకు స్థానికులు, పోర్టర్ల దగ్గరకు వెళ్లాం. యతి అన్న మాటను వాళ్లు కొట్టిపారేశారు. ఎలుగ్గొడ్డు అని చెప్పారు. ఇటీవలి కాలంలో అక్కడ తరచూ ఎలుగులు వస్తున్నాయన్నారు” అని నేపాల్​ ఆర్మీ బ్రిగేడియర్​ జనరల్​ బిగ్యాన్​ దేవ్​ పాండే చెప్పారు. నేపాల్  ఆర్మీ వ్యాఖ్యలతో యతిపై మళ్లీ చర్చ మొదలైంది.

 

Latest Updates