వైరల్ వీడియో: హలో.. నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా

పాట్నా: బిహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాలు.. పాట్నాలో తమ సమస్యలపై ధర్మా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులను టీచర్లు కోరారు. అయితే పర్మిషన్ రాకపోగా.. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న తేజస్వీ యాదవ్ టీచర్లు ధర్మా చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. చీఫ్ సెక్రెటరీ, పోలీస్ చీఫ్‌‌తోపాటు పాట్నా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌‌తో ఫోన్‌‌లో మాట్లాడి ధర్మాకు పర్మిషన్ ఇప్పించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్‌‌లో హల్‌‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో పాట్నా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ చంద్రశేఖర్ సింగ్‌‌తో తేజస్వీ మాట్లాడుతూ కనిపించారు. ఆయన చుట్టూ నిరసన చేస్తున్న టీచర్లు ఉన్నారు.

డీఎం చంద్రశేఖర్‌ సింగ్‌‌తో తేజస్వీ యాదవ్ ఫోన్ సంభాషణ:
తేజస్వీ: టీచర్లకు ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. పర్మిషన్ ఇవ్వాలని ప్రతి రోజూ పోలీసులను అడగాలా? వీళ్లపై లాఠీచార్జ్ చేశారు. వీరి ఆహారాన్ని విసిరేశారు. వీళ్లందరూ చెల్లాచెదురయ్యారు.. మిగిలిన కొందరు ఎకో పార్క్ వద్ద ఉన్నారు. నిరసన తెలపడం వారి ప్రజాస్వామ్య హక్కు. అది చేసుకోనివ్వండి. వీళ్ల దరఖాస్తును మీకు వాట్సాప్ చేస్తా. దయచేసి నిరసన తెలిపేందుకు  అనుమతించండి. ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో చెప్పండి?
డీఎం చంద్రశేఖర్: ఎప్పటి వరకా? నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా?
తేజస్వీ: డీఎం సాబ్ నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా.
డీఎం చంద్రశేఖర్: హా.. చెప్పండి సార్, ఓకే సార్.
తేజస్వీ: వాట్సాప్ ద్వారా అప్లికేషన్ పంపుతున్నా. త్వరగా స్పందించండి లేదా ఈ రాత్రంతా నేను ఇక్కడే కూర్చుంటా.

తేజస్వీ తన పేరు చెప్పగానే డీఎం భయపడి ఓకే చెప్పడంపై నెట్‌‌లో కామెంట్స్ వస్తున్నాయి. దేశంలో ఫాస్ట్‌‌గా ఎదుగుతున్న మాస్ లీడర్ తేజస్వీ యాదవ్ అని ప్రముఖ ఉద్యమకారుడు సుధీంద్ర కులకర్ణి వ్యాఖ్యానించారు.

Latest Updates