ఇండిపెండెన్స్‌ తర్వాత ఇదే మొదటి సారి..

ఇది ఎకనామిక్‌ ఎమెర్జెన్సీనే
వైరస్‌ వ్యాప్తిని నిలువరించడమే ముఖ్యం
రిటైల్ ఎన్‌పీఏలు పెరుగుతాయి

గత కొన్నేళ్లుగా దేశంలోని స్మాల్‌, మీడియం ఇండస్ట్రీస్‌‌‌‌ కష్టాలపాలయ్యాయని, అలాంటి వాటి దగ్గర ఇప్పుడు అసలు వనరులే ఉండవని
రాజన్‌ తెలిపారు. అన్నింటినీ కాకపోయినా, పరిమిత వనరులతో వాటిలో కొన్నింటినైనా కాపాడటం అవసరమని రాజన్‌‌‌‌ అభిప్రాయపడ్డారు. వ్యాపారంలో నిలబడగలవని గుర్తించిన సంస్థలను కాపాడాలని తెలిపారు. బ్యాంకు లోన్లకు సిడ్బినుంచి క్రెడిట్‌ గ్యారంటీ ఇప్పించడం వంటి
చర్యలు బాగా ఉపయోగపడతాయన్నారు. అలాంటి రిస్క్‌‌‌‌లు తీసుకోవడానికి బ్యాంకులు అంతగా ఇష్టపడకపోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ
బ్యాంకులకు నష్టం వస్తేకొంత మేర తానే భరిస్తానని ప్రభుత్వం హామీ ఇవ్వాలని, ఆ చిన్న సంస్థలు గత ఏడాదిలో చెల్లించిన ఇన్‌‌‌‌కంట్యాక్స్‌‌‌‌ ఎంత మేర చెల్లించాయో అంత మేరకు బ్యాంకులకు ప్రభుత్వం హామీ ఇవ్వచ్చని రాజన్‌‌‌‌ అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: ఇండియాకి ఇండిపెండెన్స్‌‌‌‌ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎకనమిక్ ఎమర్జెన్సీ ఎదుర్కొంటోందని ఆర్‌‌‌‌బీఐ మాజీ గవర్నర్‌‌‌‌ రఘురామ్‌ రాజన్‌‌‌‌ అభిప్రాయపడ్డారు. 2008–09లో డిమాండ్‌‌‌‌ షాక్‌ వల్ల గ్లోబల్‌‌‌‌ గా ఫైనాన్షియల్ సంక్షోభం తలెత్తిందని చెబుతూ, కాకపోతే అప్పట్లో మన దేశంలోని వర్కర్లు యధాప్రకారం తమ పనులకు వెళ్లేవాళ్లని, వ్యాపార సంస్థల వృద్ధి అప్పటిదాకా పటిష్టంగా ఉందని, మన ఫైనాన్షియల్ సిస్టమ్‌ కూడా స్ట్రాంగ్‌‌‌‌ గా ఉందని, గవర్నమెంట్‌ ఫైనాన్సూ ఆరోగ్యకరంగా ఉండేదని రాజన్‌‌‌‌ వెల్లడించారు. ఐతే, కరోనా మహమ్మారిపై యుద్ధం జరుపుతున్న ఈ రోజు పరిస్థితులు ఏవీ అలా లేవని వ్యాఖ్యానించారు. అంత మాత్రాన ఆందోళన చెందక్కర్లేదని పేర్కొన్నారు. సరైన మార్గాలు ఎంచుకుని, ఏది ముఖ్యమో తెలుసుకుని, తనకున్న వనరులను చక్కగా వాడుకుంటే ఇండియా కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి బయట
పడుతుందని రాజన్‌‌‌‌ చెప్పారు. అంతేకాదు, మరింత మెరుగైన భవిష్యత్‌‌‌‌ను అందించగలదని అన్నారు. ఇప్పుడు ఇండియా ముందున్న అతి పెద్ద సవాలు కరోనా వ్యాప్తిని అరికట్టడమేనని చెబుతూ, టెస్టుల సంఖ్య పెంచుతూ, కఠినమైన క్వారంటైన్‌‌‌‌, సోషల్‌‌‌‌ డిస్టెన్సింగ్‌‌‌‌ పాటించేలా చూడటమూ ఇందుకు కీలకమని రాజన్‌‌‌‌ చెప్పారు. ఈ దిశలోనే 21 రోజుల లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ మొదటి చర్యని చెప్పారు. కరోనా వైరస్‌ సమస్యలను సమర్ధంగా ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, డిఫెన్స్‌‌‌‌ రంగాలలోని వనరులనూ వాడుకోవడంతోపాటు, అవసరమైతే రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌‌‌‌ను ఈ యుద్ధంలో భాగం చేయడానికి తగిన ప్లాన్స్‌‌‌‌ను ఇండియా రూపొందించుకుంటోందని అంటూ, కాకపోతే ఈ చర్యలు మరింత వేగంగా సాగాలని సూచించారు.

లాక్‌డౌన్‌‌‌‌ తర్వాత?
లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ తర్వాత ఏమిటి అనేది ఇప్పుడే ఆలోచించి పెట్టుకోవాలని రఘురామ్‌రాజన్‌‌‌‌ అన్నారు. ఎక్కువ కాలం లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ కొనసాగించడం కష్ట సాధ్యమైనదని చెబుతూ, కాబట్టి కొన్ని పనులను మళ్లీ మొదలు పెట్టే దిశలో చొరవ తీసుకోవాలని చెప్పారు. తిరిగి పనిలోకి వచ్చే వర్కర్ల వ్యక్తి గత రక్షణకు అవసరమైన ఎక్విప్‌‌‌‌మెంట్‌ కల్పించడమే కాకుండా, గుంపులు లేని విధంగా ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ఏర్పాట్లు అవసరమన్నారు. మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ రంగంలో సప్లై చెయిన్‌‌‌‌ మొత్తం ఇంపార్టెంట్ కాబట్టి , ప్లానింగ్‌‌‌‌ను వారికే వదిలి పెట్టాలని రాజన్‌‌‌‌ అన్నారు. ఈ ప్లాన్స్‌‌‌‌ను ప్రభుత్వాధికారులు అనుమతించేలా విధానం ఉండాలని చెప్పారు. దేశంలోని పేదలు, జీతాలు లేని లోయర్‌‌‌‌ మిడిల్‌‌‌‌క్లాస్‌ జనం బతకడానికి తగిన ఏర్పాట్లను
ప్రభుత్వం చూడాల్సి ఉంటుందన్నారు. డైరెక్ట్‌‌‌‌ బెనిఫిట్‌ ట్రాన్‌‌‌స్‌‌‌‌ఫర్స్‌‌‌‌ కొన్ని కుటుంబాలకు చేరొచ్చని, అందరికీ కాదని చెప్పారు. అంతేకాదని, డీబీటీ
కింద ఇప్పుడు ఇస్తున్న మొత్తం కూడా కుటుంబానికి నెలంతా గడపడానికి సరిపోదని వ్యాఖ్యానించారు. హౌస్‌హోల్డ్స్‌, కార్పొరేట్‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌ లోని ఇబ్బందులు ఫైనాన్స్‌‌‌‌సెక్టార్‌‌‌‌‌‌‌‌ లో ప్రతిబింభిస్తాయని రాజన్‌‌‌‌ అన్నారు. రిటైల్‌‌‌‌ అప్పులు కూడా ఎన్‌‌‌‌పీఏలుగా మారే ఛాన్స్‌‌‌‌ ఉందని అభిప్రాయపడ్డారు.

For More News..

మహేష్ బాబు కుటుంబం నుంచి మరో హీరో

ఒక్కో బస్సులో 100 మంది.. మరి వీరికి రాదా కరోనా?

విద్యార్థులను ప్రమోట్ చేద్దామా.. పరీక్షలు పెడదామా?

ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టి వేత

Latest Updates