ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అనడానికి ఇదే నిదర్శనం

ఫాలోయింగ్ ఉన్నవాళ్లు ఏం మాట్లాడినా వార్తే. ప్రస్తుతం హీరోయిన్లలో పూజా హెగ్డేకి మంచి ఫాలోయింగే ఉంది. అందుకే ఆమె ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులోనూ ఆమె మాట్లాడింది ప్రభాస్ గురించైతే.. ఇక మామూలుగా ఉంటుందా వ్యవహారం! ప్రస్తుతం ప్రభాస్‌‌తో కలిసి రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తోంది పూజ. మరోపక్క అఖిల్‌‌తో బొమ్మరిల్లు భాస్కర్‌‌‌‌ తీస్తున్న మూవీ కూడా చేస్తోంది. ఇటీవల ఆ సినిమా షూటింగ్‌‌ కోసం అమెరికా వెళ్లినప్పుడు.. ఆమెతో మాట్లాడటానికి కొందరు వచ్చారట. పూజ ఇండియా నుంచి వచ్చిందని తెలియగానే.. ‘నువ్వు ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చావా’ అని అడిగారట. ‘వాళ్లు అలా అడగడంతో నేను షాకయ్యాను. నేను ప్రభాస్‌‌తో నటిస్తున్నాని చెప్పగానే వాళ్లు ఆశ్చర్యపోయారు, ఆనందపడిపోయారు. ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అనడానికి ఇదే నిదర్శనం’ అంటోంది పూజ. అంతేకాదు.. ప్రభాస్ చాలా కూల్‌‌ అని, అలాంటి వాడికి ‘బాహుబలి’ లాంటి సినిమా దక్కడం సబబేనని కూడా అంది. ‘సాహో’ సినిమాని టాక్‌‌తో సంబంధం లేకుండా చూడటానికి వచ్చారని, సల్మాన్‌‌ తర్వాత అలా వచ్చింది ప్రభాస్‌‌ మూవీకేనని చెప్పింది. అందరూ ఇష్టపడుతున్న ప్రభాస్‌ని పూజ ఎంతగా మెచ్చిందో ఆమె మాటల్లోనే అర్థమవుతోంది.

Latest Updates