ప్రపంచంలోనే పెద్ద కంప్యూటర్ చిప్

కంప్యూటర్​ చిప్​ అంటే చిన్నగా, చేతి వేలిపై ఇమిడేలా ఉంటుంది. కానీ, కాలిఫోర్నియాకు చెందిన సెరిబ్రస్​ సిస్టమ్స్​ అనే స్టార్టప్​ ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్​ చిప్​ను తయారు చేసింది. 21 చదరపు సెంటీమీటర్లున్న దాని పేరు వేఫర్​ స్కేల్​ ఇంజన్​.  ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (కృత్రిమ మేధ– ఏఐ)కి ఈ చిప్పే మూల స్తంభంలా ఉంటుందని కంపెనీ అంటోంది. మామూలు కంప్యూటర్​ చిప్​లలో 30 ప్రాసెసర్​ కోర్​లుంటాయి. అదే గ్రాఫిక్​ ప్రాసెసింగ్​ యూనిట్లలో అయితే వాటి కన్నా ఎక్కువ ఉంటాయి. జీపీయూ చిప్​లో దాదాపు 5 వేల దాకా కోర్​లు ఉంటాయి. కానీ, సెరిబ్రస్​ తయారు చేసిన ఈ పెద్ద చిప్​లో 4 లక్షల కోర్​లున్నాయి. ఆ కోర్​లను ఒకదానికొకటి హై బ్యాండ్​విడ్త్​లతో కనెక్ట్​ చేసి పెట్టారు.  దాని వల్ల అతి కష్టమైన మెషీన్​ లెర్నింగ్​ సవాళ్లనూ ఈజీగా చేయొచ్చని కంపెనీ చెబుతోంది. కొన్ని నెలలు పట్టే పనిని నిమిషాల్లో చేసేస్తుందని అంటోంది. ఇప్పటికే కొందరు కస్టమర్లకు ఆ చిప్​ను కంపెనీ అమ్ముతోంది. దాని ధర ఎంతో మాత్రం చెప్పలేదు. పెద్ద చిప్​లతో టైం కలిసొస్తుందేమో గానీ, దాని వల్ల నష్టాలూ అదే రేంజ్​లో ఉంటాయని ఆనంద్​టెక్​ అనే న్యూస్​ వెబ్​ ఎడిటర్​ డాక్టర్​ ఇయాన్​ కట్రెస్​ చెప్పారు. చిన్న చిప్​లు తక్కువ శక్తిని తీసుకుని పని చేస్తాయని, వేడి అయితే సులభంగా చల్లార్చొచ్చని అన్నారు. కానీ, ఇలాంటి పెద్ద చిప్​లను వాడాలనుకుంటే మాత్రం వాటికంటూ ప్రత్యేకమైన సెంటర్లు, వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందన్నారు. కాబట్టి ప్రాక్టికల్​గా వాటి వాడకం ఖర్చుతో కూడుకున్నదని వివరించారు. కాబట్టి ప్రస్తుతానికి అది ఏఐకి మాత్రమే సూట్​ అవుతుందని చెప్పారు.

Latest Updates