లైట్‌తో కరోనా ఖతం

అమెరికా డిపార్ట్ ‌మెంట్ ‌ఆఫ్‌‌హోమ్‌‌ లాండ్‌ సెక్యూరిటీ వెల్ల‌డి
సూక్ష్మ రంధ్రాల్లేని సర్ఫేస్ ‌పై వైరస్‌ల సంఖ్య
2 నిమిషాల్లో సగమైతది
రూమ్‌ టెంపరేచర్‌ దగ్గరగాలిలోని
కరోనా 90 సెకండ్లలోనే ఔట్ ‌
చైనా వల్ల 184 దేశాలు నరకం చూస్తున్నాయన్న ట్రంప్

న్యూయార్క్‌‌: కరోనాను చంపేయడానికి పేషెంట్ల శరీరంలోకి రసాయనా లను ఎక్కించాలని, అతినీలలోహిత కిరణాలను (యూవీ రేస్) పంపి కూడా చూడాలని కొన్ని రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‌‌సూచించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇదేం సలహా అంటూ మండిపడ్డ వాళ్లూ ఉన్నారు. కానీ ట్రంప్ ‌‌‌మాటలకు బలాన్నిచ్చే వివరాలను అమెరికా డిపార్ట్ మెంటం ‌‌‌‌ఆఫ్ ‌‌‌‌హోమ్ ‌‌‌‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌) మంగళవారం విడుదల చేసింది. అతినీలలోహిత కిరణాలు వైరస్‌‌‌‌ను ఎట్ల చంపేస్తాయో వివరంగా చెప్పింది.

మేరీలాండ్‌‌లో ప్రయోగం..

ఎలాంటి సూక్ష్మ రంధ్రాల్లేని ఉపరితలంపై సూర్యకాంతి పడితే దానిపై ఉండే వైరస్‌‌‌‌ల శాతం రెండు నిమిషాల్లో సగానికి పడిపోతుందని డీహెచ్‌‌‌‌ఎస్ ‌‌‌అధికారి విలియం బ్రయాన్‌‌ ‌తెలిపారు. ఆ టైమ్‌‌‌‌లో టెంపరేచర్ ‌‌‌‌21 నుంచి 24 డిగ్రీలు, తేమ 80 శాతం ఉండాలని చెప్పారు. అలాగే రూమ్ ‌‌‌‌టెంపరేచర్ ‌‌‌‌దగ్గర గాలిలో ఉండే వైరస్ ‌‌‌ఒకటిన్నర నిమిషంలోనే సగానికి తగ్గుతందని, ఇందుకు తేమ 20 శాతం ఉండాలని తెలిపారు. ఇదంతా ప్రయోగాత్మంగా చేసి చూశామన్నారు. సహజంగా ఉండే సూర్యకాంతిలో అతినీలలో హిత కాంతి ఉపవరమైన యూవీఏ ఉంటుందని, ఇది మన చర్మాన్ని దెబ్బతీస్తుందని తెలుసని, కానీ వైరస్‌‌‌‌ను కూడా నాశనం చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయామని కొలంబియా యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌‌‌‌లోని సెంటర్ ‌‌‌ఫర్ ‌‌‌‌రేడియాలజికల్‌ రీసెర్చ్ ‌‌‌‌డైరెక్టర్ ‌‌‌‌డేవిడ్ ‌బ్రెన్నర్ ‌‌‌‌అన్నారు. మేరీలాండ్‌‌‌‌లోని నేషనల్‌ బయోడిఫెన్స్ ‌‌‌‌అనాలిసిస్ ‌‌‌‌అండ్ ‌కౌంటర్‌ ‌‌మెజర్స్‌‌‌‌సెంటర్‌‌‌‌లో ప్రయోగం చేశామని, స్టీల్‌పై డ్రాప్‌ ‌‌లెట్స్‌‌‌‌ను వాడామని ఓ డీహెచ్‌‌‌‌ఎస్ ‌‌‌‌స్పోక్స్ ‌‌‌‌పర్సన్‌‌‌‌ చెప్పారు.

మీట్‌ ప్లాంట్స్ ‌తెరిస్తే కష్టం: వర్కర్ల యూనియన్లు

మాంసం ప్రాసెసింగ్ ‌‌‌‌ప్లాంట్లను తెరిచే ఉంచాలన్న ట్రంప్ ‌‌‌‌ఆదేశాలపై యూనియన్లు భగ్గుమన్నాయి. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నారని మండిపడ్డాయి. మీట్ ‌‌‌‌ప్యాకింగ్ ప్లాంట్‌‌‌‌లో పని చేసే వాళ్ల‌కూ వైరస్ ‌‌‌‌రావడం, 20 మంది చనిపోవడంతో దేశంలో 20కి మించి ప్లాంట్లు మూతబడ్డాయి. పైగా 6,500 మందికి పైగా వర్కర్లు వైరస్ ‌‌‌‌బారిన పడినట్టు కూడా అంచనా వేశారు.

చైనాపై ట్రంప్ ‌మళ్లీ ఫైర్‌

‘కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 184 దేశాలు అల్లాడి పోతున్నాయి. ఒకరకంగా నరకాన్ని చూస్తున్నాయి. వైరస్‌‌‌‌ను అది పుట్టిన దగ్గరే కట్టడి చేయకపోవడంవల్ల ఇట్లాంటి పరిస్థితి దాపురించింది. నిజంగా ఇది దారుణం’ అంటూ చైనాపై మరోసారి ట్రంప్ ‌‌‌‌విరుచుకుపడ్డారు. కరోనా ఎక్కువున్న ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు వైరస్‌‌ ‌స్కానింగ్ ‌‌‌‌చేసే విషయమై ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

చలికాలంలో మళ్లీ విరుచుకుపడ్తది: ఫౌచీ

చలికాలంలో కరోనా మళ్లీ విరుచుకుపడుతుందని, దీనికి అమెరికా సిద్ధంగా లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని వైట్ ‌‌‌‌హౌస్ ‌‌‌‌మెడిక‌‌‌‌ల్ అడ్వౌజ‌ర్ ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. రాష్ట్రాలు లాక్‌డౌన్‌‌‌‌ను ఎత్తేస్తే మళ్లీ కొన్ని వారాల కిందటి పరిస్థితి ఎదుర్కోక తప్పదని, ఇంతకుమించి మరణాలు సంభవించొచ్చని అన్నారు. కరోనా తీవ్రత ఎక్కువున్న న్యూయార్క్‌‌‌‌లో బిజినెస్ ‌‌‌‌యాక్టివిటీని మెల్లగా స్టార్ట్ ‌చేసేందుకు ఆ
రాష్ట్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సలహాల కోసం ఓ కమిటీ వేసింది. ఇందులో ముగ్గురు ఇండియన్‌‌‌‌ అమెరికన్లు మాస్టర్‌‌‌‌ కార్డ్ ‌సీఈవో అజయ్‌ బంగ, టండన్ ‌‌‌‌క్యాపిటల్‌ అసోసియేట్స్ ‌‌‌చంద్రికా టండన్‌‌‌‌, న్యూయార్క్‌‌ ‌సిటీ హోటల్‌ అసోసియేషన్ ‌‌‌సీఈవో విజయ్‌ దండపాని సభ్యులుగా ఉన్నారు.

Latest Updates