అమ్మ మనస్సులో అనుకుంది..15 ఏళ్ల తరువాత కొడుకు ఆచూకీ కనిపెట్టింది

మనం లక్ష్యం ఎంత కష్టం అయినా సరే గట్టినమ్మకంతో మనస్సులో అనుకుంటే సరిపోతుందని ఆధ్యాత్మిక గురువులు  చెబుతుంటారు. అదే నమ్మకం తల్లీ కొడుకును కలిపింది. భర్తతో విభేదాలు, అనారోగ్య సమస్యలతో గతం మరిచిపోయిన తల్లి 15ఏళ్ల తరువాత  కుమారుడికి దగ్గరైంది. సస్పెన్స్  సినిమా స్టోరీని తలపించే తల్లి ‌‌- కొడుకు కథేంటో తెలుసుకుందాం.

కోల్ కత్తాకు చెందిన రమాదేవి చౌదరి 15ఏళ్ల కిత్రం భర్తతో విభేదాలొచ్చి విడిపోయింది. అప్పటికే రెండేళ్ల కొడుకు మిత్రజిత్ ఉన్నాడు. కొడుకును భర్త దగ్గరే వదిలేసి కోల్ కత్తా నుంచి ఢిల్లీకి వచ్చి మధ్యలో ఆగిపోయిన తన లా చదువును కంప్లీట్ చేసింది. సుప్రీం కోర్ట్ లో మంచి క్రిమినల్ లాయర్ గా మంచి పేరు సంపాదించింది.

2012లో రమాదేవి చౌదరి కోర్ట్ లో ఓ కేసు వాదిస్తుండగా స్కిజోఫ్రీనియా పర్సనాలిటీ డిజార్డర్‌ తో వింతగా ప్రవర్తించింది. దీంతో జడ్జ్ పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. అలా 9నెలలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ ఆస్పత్రి, రెండు సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని ఆ వ్యాధినుంచి బయటపడింది. అదే వ్యాధితో బాధపడేవాళ్లను ఆదుకునేందుకు ఎన్జీవోను స్టార్ట్ చేసింది.

కాలం గిర్రున తిరిగింది. ఓ రోజు లాయర్ రమాదేవికి తన గతం తాలుకూ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. భర్త గుర్తించి ఆమె గతం గుర్తుకురాలేదు. తన కొడుకు ఉన్నాడని పేరు, మిత్రజిత్ అని కనిపెట్టింది. కొడుకు ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రోజులు గడుస్తున్నాయి. చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.

అయితే ఓ రోజు రమాదేవి చౌదరి తన కొడుకు ఇంద్రజిత్ చౌదరి పేరుతో ఫేస్ బుక్ లో సెర్చ్ చేసింది. చాలా పేర్లు వచ్చాయి. అందరికి మీ పేరు ఇంద్రజిత్ చౌదరా..? మీ అమ్మ పేరు రమాదేవి చౌదరా..? అయితే ఫోన్ చేయండి అంటూ ఫోన్ నెంబర్ మెసేజ్ చేసింది. పదుల సంఖ్యలో అందరికి నెంబర్ పంపించింది కానీ రిప్లయ్ రాలేదు. కానీ ఓ రోజు రమాదేవి నెంబర్ నుంచి హలో మీరు రమాదేవి బంధువులా ఆమె గురించి నాకో ఇన్ఫర్మేషన్ కావాలంటూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ తో రమాదేవి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు మెసేజ్ చేసింది తన కొడుకు మిత్రజిత్ అని కన్ఫాం చేసుకుంది. అతనితో చాట్ చేసి వివరాలు తీసుకుంది.

మిత్రజిత్ (22) వైజాగ్ లో హెచ్ ఆర్ గా విధులు నిర్వహిస్తుండగా..భర్త కోల్ కత్తాలో ఉన్నాడు. సెప్టెంబర్ 25న కొడుకు మిత్రజిత్ వైజాగ్ నుంచి ఢిల్లీలో ఉన్న తల్లిని కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తల్లికొడుకుల ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. తన కొడుకున్న కలుసుకున్న సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ కొడుకు ఆచూకీ కనిపెట్టాని గట్టినమ్మకంతో మనస్సులో అనుకున్నా అదే నిజమైంది అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

Latest Updates