ఈ మెషీన్ మనుషులతో డిబేట్ చేస్తది

ఈ మెషీన్ మనుషులతో డిబేట్ చేస్తది

టీవీల్లో, చర్చా వేదికల్లో రకరకాల రంగాల్లో మేధావులు చర్చలు చేస్తుంటారు. రాజకీయ పార్టీల వాళ్లయితే మా పాయింట్ కరెక్ట్ అంటే మా పాయింటే కరెక్ట్‌‌‌‌ అని వాదించుకుంటుంటారు. ఇక సైన్స్, టెక్నాలజీ, సాహిత్యం, ఎన్విరాన్‌‌‌‌మెంట్ ఇలా ఏదైనా సరే వాటిలో మార్పులు, సమాజానికి జరిగే మంచి, చెడులపై డిబేట్లు జరుగుతుంటాయి. ఆ చర్చ ఎలాంటిదైనా సరే మనుషులతో పోటీ పడి గెలవగలిగే ఆర్టిఫీషియల్ డిబేటర్ రాబోతోంది. ఏదో ఒకటి వాదించడం కాదు, తన వాదనకు బలం చేకూర్చే ఆధారాలను కూడా చూపెడుతూ డిబేట్‌‌‌‌లో పైచేయి సాధించడం దీని స్పెషాలిటీ. అదే ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన ఐబీఎం తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెషీన్. దీనికి ‘ప్రాజెక్ట్ డిబేటర్’ అని ఆ కంపెనీ పేరు పెట్టింది.
ఇంకా మార్పులు చేయాలె
ప్రాజెక్ట్ డిబేటర్‌‌‌‌‌‌‌‌కు చర్చలో పాల్గొనాలంటే ముందు దానికి డేటా అవసరం. అందు కోసం దాదాపు 40 కోట్ల న్యూస్ ఆర్టికల్స్, వేలాది డిబేట్ టాపిక్స్‌‌‌‌కు సంబంధించిన ఫ్యాక్స్‌‌‌‌ డేటాను దానిలో ఫీడ్ చేశారు ఐబీఎం సైంటిస్టులు. పదేండ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయని, లాంగ్వేజ్‌‌‌‌ను అర్థం చేసుకోవడం, అదే లాంగ్వేజ్‌‌‌‌లో సమాధానం చెప్పడంసహా ఒకేసారి వేర్వేరు అంశాలను ఇంటర్‌‌‌‌‌‌‌‌లింక్ చేసి ఆలోచించడం లాంటివి ప్రోగ్రామ్ డిబేటర్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని రీసెర్చర్ స్లోనిమ్ చెప్పారు. రీజనింగ్ లాంటివి మనుషుల కంటే బెటర్‌‌‌‌‌‌‌‌గా చేయగలుగుతున్నప్పటికీ, కావాలని మనిషి వేరే టాపిక్‌‌‌‌లోకి వెళ్లినప్పుడు మెషీన్ కన్ఫ్యూజ్ అవుతున్నదని అన్నారు. కంఫర్ట్ జోన్‌‌‌‌ నుంచి బయటకు వచ్చి డిబేట్ చేయగలిగేలా మరిన్ని చేంజెస్ చేయాల్సిఉందని తమ రీసెర్చ్‌‌‌‌లో తేలిందని చెప్పారు. అప్పుడే ఇది మనుషులపై గెలిచే డిబేటర్ అవుతుందన్నారు. 2019లో తొలిసారి పబ్లిక్‌‌‌‌లో డిబేటింగ్ ఎక్స్‌‌‌‌పర్ట్ హరీశ్ నటరాజన్‌‌‌‌తో ఈ ప్రోగ్రామ్ డిబేటర్ చర్చలో పాల్గొన్నప్పటికీ,  నేటికీ దీనిపై ప్రపంచవ్యాప్తంగా 50 ప్రముఖ ల్యాబొరేటరీలు వర్క్ చేస్తున్నాయి. వందలాది సాఫ్ట్ వేర్ టీమ్స్ దానిలో చేయాల్సిన మరిన్ని అడ్వాన్స్‌‌‌‌మెంట్స్‌‌‌‌పై రీసెర్చ్ చేస్తున్నాయి.

మెషీన్ ‘బుర్ర’ వాడ్తది
డిబేట్ అంటే పరస్పరం భిన్నమైన అభిప్రాయాలున్న వ్యక్తుల మధ్య జరిగే సంవాదం. ఒక వ్యక్తి చెప్పే పాయింట్‌‌‌‌ను అర్థం చేసుకుని, దానికి అవతలి మనిషి ఆలోచించి, ఎలా చెబితే మన వాదన నెగ్గుతుందనేది తేల్చుకుని కౌంటర్ ఇవ్వాలి. డిబేట్ చేయడమంటే ఏం ఆషామాషీ వ్యవహారం కాదు. బుర్రకు చాలా పని చెప్పాలి. ఆధారాలతో సహా మాట్లాడుతూ అవతిలి వాళ్లపై చర్చలో గెలవాలి. ఈ పనిని మెషీన్ ఎట్ల చేయగలదు అని డౌట్ రావచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ ద్వారా చాలా డీసెంట్‌‌‌‌గా మనుషులతో డిబేట్ చేసి గెలిచే సత్తా కలిగిన మెషీన్‌‌‌‌ను ఐబీఎం డెవలప్ చేసింది.  మనుషులతో పోటీ పడి తన పాయింట్‌‌‌‌ను అర్థవంతంగా, ఆధారాలను ప్రస్తావిస్తూ డిబేట్ చేస్తుంది. ఈ మెషీన్‌‌‌‌పై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ డుండీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆర్గ్యుమెంట్ మైనింగ్, డేటా ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనిషి బ్రెయిన్ చేసే కాంప్లెక్స్ కాగ్నిటివ్ స్కిల్స్‌‌‌‌ను ఈ మెషీన్ అప్లై చేస్తుందని తెలిపారు.