మొబైల్ యూజర్లకు షాక్.. భారీగా పెరగనున్న టాక్ టైమ్ ధరలు?

న్యూఇయర్ సందర్భంగా టాక్ టైమ్ ప్లాన్స్ భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ టైమ్ లో టెలికాం రంగ సంస్థలైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు టాక్ టైమ్ ధరల్ని 15 నుంచి 20శాతం పెంచేందుకు సిద్ధమైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

2016 రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రేట్లు పెరగడం ఫస్ట్ టైం. ఒక్కొక్క వొడాఫోన్ ఐడియా యావరేజ్ రెవెన్యూ.. రూ.119గా ఉండగా భారతీ ఎయిర్‌టెల్ (రూ.162), జియో(రూ.145)గా ఉంది. ఈ సందర్భంగా వొడాఫోన్ ఐడియా ఎండీ రవీందర్ టక్కర్ ప్రస్తుత టాక్ టైమ్ ధరల గురించి మాట్లాడుతూ.. ధరలు రేట్లు పెంచడంలో ఎటువంటి మొహమాటం లేదు. అందుకే ఈ ఇయర్ ఎండింగ్ లో టాక్ టైమ్ ధరల్ని పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు.

Latest Updates