ఈ చాలెంజ్.. అంత వీజీ కాదు

This not a easy Challenge

ఎక్కడెక్కడో విదేశాల్లో పుట్టినవి మాకెం దుకనుకున్నారో ఏమో!.. ఈ మధ్య మనోళ్లు సొంతంగా చాలెంజ్ లను సృష్టిస్తు న్నారు. సెలబ్రిటీల పుణ్యమాని వాటిల్లో కొన్ని సక్సెస్ అవుతున్నాయి. ఇంకొన్ని మాత్రం ప్రచారంలోనే తుస్సుమంటున్నాయి. తాజాగా సినిమా హీరోయిన్ల కారణంగా సోషల్ మీడియాలో కొత్త చాలెంజ్ ఒకటి చక్కర్లు కొడుతోం ది. అయితే అది చెప్పుకున్నంత సులువు మాత్రం కాదు అంటున్నారు కొందరు.

‘స్ట్రెచ్ ఛాలెంజ్’ అంటే.. కాళ్లను రెండువైపులా 90 డిగ్రీల కోణంలో చాచి నిలకడగా కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఇంతకీ ఇది ఎలామొదలైందంటే.. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా ‘దే దే ప్యా ర్ దే’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే17న రిలీజ్ కాబోతోంది. మొన్నీమధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. రెండు కార్ల మధ్యలో కాళ్లను చాచి అజయ్ బిత్తరపోయి చూస్తుంటాడు. హీరోయిన్లు టబు, రకుల్ ప్రీత్ సింగ్ చెరో వైపు కూర్చుని ఉంటారు. ఈ పోస్టర్ ఆధారంగా రకుల్#SplitLikeAJ హ్యాష్ ట్యాగ్‌తో ‘స్ట్రెచ్ చాలెంజ్’ క్రియేట్ చేసింది.అయితే ఆ చాలెంజ్ ను రకుల్ పూర్తి చేయలేకపోయింది. ‘సక్సెస్ కాలేకపోయా..కానీ, ట్రై చేశా’ అంటూ ట్విట్టర్లో ఒకపోస్ట్ చేసింది. ఆ వెంటనే మరో స్టార్ హీ రోయిన్ పూజా హెగ్డే ‘స్ట్రెచ్ ఛాలెంజ్’ని స్వీకరించి సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది.అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈచాలెంజ్ వైరల్ అవుతోంది. సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా ఆ చాలెంజ్ ను ట్రై చేస్తూ ఫొటోలను అప్ లోడ్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఫన్నీగా ప్రయత్నిస్తూ ఆ ఫోటోలను పెడుతున్నారు. అయితే ఇలాంటి రిస్కీ ఛాలెంజ్‌ల‌ను నిపుణుల సమక్షంలోనే చేయాలని సూచిస్తున్నారు ఈ చాలెంజ్ ను విజయవంతంగా పూర్తిచేసినోళ్లు. స్టంట్ మాస్టర్ వీరూ దేవగణ్ నుంచి వారసత్వంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అజయ్ దేవగణ్.. గతంలో‘పూల్ ఔర్ కాంటే’, ‘జిగర్’ సినిమాలకోసం స్ట్రెచ్ స్టంట్ ను చేశాడు..

Latest Updates