రైల్వే జాబ్ కొట్టాలంటే.. ఈ అంశాలపై ఫోకస్ పెట్టండి

మంచి జీతంతో కూడిన గవర్నమెంట్​ జాబ్​ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రైల్వే ఎన్​టీపీసీ(నాన్​ టెక్నికల్​ పాపులర్​ క్యాటగిరీస్​) ఎగ్జామ్​ మంచి అవకాశం. 35,208 పోస్టులకు 2019 మార్చిలో అప్లై చేసిన అభ్యర్థులు ఎగ్జామ్స్​ కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంగా నిరీక్షిస్తున్నారు. 2020 డిసెంబర్​ 15 నుంచి కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా షిఫ్ట్​ల వారీగా సీబీటీ ఎగ్జామ్స్ మొదలవుతాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎన్​టీపీసీ ఎగ్జామ్స్​కు ఇప్పటి నుంచే ఎలా ప్రిపేరవ్వాలి… ఏయే అంశాలపై ఫోకస్​ పెట్టాలనే అంశాలపై సబ్జెక్ట్​ ఎక్స్​పర్ట్​ ప్రిపరేషన్​ ప్లాన్​. 

ఆర్​ఆర్​బీ  ఎన్​టీపీసీ పరీక్ష సీబీటీ–1, సీబీటీ–2, టైపింగ్​ స్కిల్​ టెస్ట్​/కంప్యూటర్​ బేస్డ్​ ఆప్టిట్యూడ్​ టెస్ట్​ అనే స్టేజీలలో నిర్వహిస్తారు. సీబీటీ–1 పరీక్ష అన్ని పోస్టులకు కామన్​గా ఉంటుంది. ఇది ఆన్​లైన్​ పరీక్ష.  తెలుగుతోపాటు దేశ వ్యాప్తంగా 14 భాషలలో ఈ టెస్ట్​ ​నిర్వహిస్తారు.  ఎగ్జామ్​100 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి వన్​ థర్డ్​ మార్కు కోత ఉంటుంది. ఎగ్జామ్​ మొత్తం టైం 90 నిమిషాలు. ఇందులో అభ్యర్థి స్కోర్​ చేసిన మార్కులు ఫైనల్​ సెలక్షన్​లో కలుపరు. ఇది కేవలం సీబీటీ–2కు ఎంపిక పరీక్ష మాత్రమే. ​ జనరల్​ అభ్యర్థులకు 40 శాతం, ఓబీసీ(నాన్​క్రిమీలేయర్​)& ఎస్సీలకు 30 శాతం,  ఎస్టీ అభ్యర్థులకు 25 శాతం మినిమం క్వాలిఫైయింగ్​ మార్క్స్.  మొత్తం పోస్టులకు 20 రెట్లు ఉండేవిధంగా అభ్యర్థులను సీబీటీ–2కు ఎంపిక చేస్తారు.

సీబీటీ–2: సీబీటీ–1లో ఉన్న సిలబస్​ అంశాలే సీబీటీ–2లోనూ ఉంటాయి. అయితే డిఫికల్టీ లెవెల్​ మాత్రం సీబీటీ–2లో పెంచుతారు. సీబీటీ–1తో పోలిస్తే ప్రశ్నల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇక్కడ 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు పరీక్షలకు కామన్​ సిలబస్​ ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్టును కాన్సెప్ట్​ ఓరియెంటెడ్​ మెథడ్​లో లోతుగా అధ్యయనం చేస్తే విజయం సాధించవచ్చు.

ప్రిపరేషన్ ఇలా..

ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ పరీక్ష అంత కఠినమైన ఎగ్జామ్​ ఏం కాదు. సిలబస్​ను ఎగ్జామ్​ ప్యాటర్న్​ సరిగా అర్థం చేసుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపేరైతే జాబ్​ కొట్టడం ఈజీ. సీబీటీ–1లో కనీసం 80 మార్కులు సాధించడానికి ఎలా సన్నద్ధమవ్వాలనేది సబ్జెక్టుల వారీగా చూద్దాం.

మ్యాథమెటిక్స్

ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీలోని అన్ని సెక్షన్లలో అభ్యర్థులకు మ్యాథమెటిక్స్​ కష్టంగా అనిపించినప్పటికీ ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్​ చేస్తే సమస్యలు సాల్వ్​ చేయడం సలువు. బేసిక్​ అంశాలతో ప్రిపరేషన్​ మొదలు పెట్టి కాన్సెప్ట్  మీద కమాండ్​ వచ్చిన తర్వాత షార్ట్​కట్స్​పై దృష్టి పెట్టాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే 30 శాతం ప్రిపరేషన్​ పూర్తయినట్లే. ఒక ప్రశ్నకు నిమిషంలోపల ఆన్సర్​ చేయగలగాలి. మ్యాథమెటిక్స్​ టాపిక్స్​ను   ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో సాధిస్తే సులభంగా అర్థమవుతాయి.

బేసిక్​ అర్థమెటిక్​ ఆపరేషన్స్​ నుంచి ఒకటి నుంచి 2 ప్రశ్నలు వచ్చే చాన్స్​ ఉంటుంది. ఇందులో బోడ్​మాస్​ను ఉపయోగించి చేసే సింప్లిఫికేషన్స్​, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు ఉంటాయి.  ఎల్​సీఎం & హెచ్​సీఎఫ్​, పర్సంటేజీలు, రేషియో ప్రపోర్షన్​, ఏజస్, ప్రాఫిట్​​, లాస్​ అండ్​ డిస్కౌంట్​, టైమ్​ అండ్​ వర్క్​, పైప్స్​ అండ్​ సిస్టర్న్​, టైమ్​, స్పీడ్​, డిస్టాన్స్​, ట్రైన్స్​, బోట్స్​ అండ్​ స్ట్రీమ్స్​, సింపుల్ అండ్​ కాంపౌండ్​ ఇంట్రెస్ట్​, మెన్స్యూరేషన్​, ట్రిగనోమెట్రి, బేసిక్​ ఆల్​జీబ్రా, బేసిక్​ జామెట్రి, బేసిక్​ స్టాటిస్టిక్స్​ టాపిక్స్​ నుంచి కనిష్టంగా 1 నుంచి గరిష్టంగా 3 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని చాప్టర్లు పూర్తి చేసిన తర్వాత ఎస్​ఎస్​సీ, సీడీఎస్​  ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేయాలి. వీటిలో ప్రశ్నల స్థాయి ఆర్​ఆర్​బీ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ వీటిని సాల్వ్​ చేస్తే ఆర్​ఆర్​బీ మ్యాథమెటిక్స్​​​ ప్రశ్నలు సాధించడం తేలికవుతుంది.

జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్

ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఎగ్జామ్​లో అన్ని సెక్షన్లలో తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు స్కోర్​ చేసే సెక్షన్​ జనరల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ రీజనింగ్. ఇందులో ఒక టాపిక్​కు మరో దానికి లింక్​ ఉండదు. అన్నీ ఇండిపెండెంట్​ టాపిక్​లే. ఒక్కో చాప్టర్​లోని కాన్సెప్ట్​ను పూర్తిగా అవగతం చేసుకున్నాకే మరో చాప్టర్​ స్టార్ట్​ చేస్తే బాగుంటుంది. ఈ సెక్షన్​ నుంచి వచ్చే ప్రశ్న ఏదైనా దాన్ని 45 సెకండ్లలో సాల్వ్​ చేసేలా ప్రిపేరైతే విజయం సాధించవచ్చు. ఎన్​టీపీసీ గత పరీక్ష పత్రాలను పరిశీలిస్తే. కోడింగ్​ అండ్​ డికోడింగ్​, వెన్​ డయగ్రామ్స్​, అనలాజిస్​, క్లాసిఫికేషన్​, ఆల్ఫాబెటికల్​ అండ్​ నంబర్​ సిరీస్​, సీటింగ్​ అరేంజ్​మెంట్స్​, పజిల్స్​, స్టేట్​మెంట్​ అండ్​ కన్​క్లూజన్​, కోర్స్​ ఆఫ్​ యాక్షన్​, అజ్యంప్షన్స్​ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. మ్యాథమెటికల్​ ఆపరేషన్స్​, రక్త సంబంధాలు, సిలాగిజమ్​​, డైరెక్షన్స్​, ర్యాంకింగ్స్​, డెసిషన్​ మేకింగ్​, డేటా సఫీషియెన్సీ చాప్టర్ల నుంచి కొంత తక్కువ అడుగుతున్నారు. ఈ టాపిక్స్​ అన్ని పూర్తి స్థాయిలో ప్రిపేరైన తర్వాత ఎస్​ఎస్​సీ ప్రీవియస్​ ఇయర్స్​ టాపిక్​ వైజ్​ క్వశ్చన్స్​ ప్రాక్టీస్​ చేయాలి.

జనరల్ అవేర్నెస్

ఎన్​టీపీసీ ఎగ్జామ్​ అన్ని సెక్షన్లలో అతి తక్కువ సమయంలో ఆన్సర్​ చేయగలిగే సెక్షన్​ జనరల్​ అవేర్​నెస్​. మార్కుల పరంగా ఈ సెక్షన్​ కీలకం. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జనరల్​ సైన్స్​ నుంచి బయాలజీలో 3 నుంచి 5 ప్రశ్నలు, కెమిస్టీలో 2 నుంచి 3 ప్రశ్నలు, ఫిజక్స్​ నుంచి 2 ప్రశ్నలు అడిగారు. ఇక జీకే విభాగంలోని హిస్టరి నుంచి 5 నుంచి 6, జాగ్రఫి నుంచి 2 నుంచి 3, పాలిటీ నుంచి 2 నుంచి 3, ఎకానమి నుంచి 2, స్టాటిక్​ జీకే నుంచి 5 నుంచి 6 ప్రశ్నలు వచ్చాయి. కరెంట్​ ఎఫైర్స్​ నుంచి అత్యధికంగా 10 నుంచి 11 ప్రశ్నలు ఉన్నాయి.  కంప్యూటర్​ అప్లికేషన్స్​ విభాగం నుంచి 3 నుంచి 4 ప్రశ్నలు వచ్చాయి. విభాగాల వారీగా ఇంపార్టెంట్​ టాపిక్స్​పై దృష్టి పెడితే ఓవరాల్​గా మంచి మార్కులు స్కోర్​ చేయొచ్చు. బయాలజీలో వ్యాధులు, శాస్త్రీయనామాలు, ఇన్​వెన్షన్స్​, కణం, టిష్యూ, మానవశరీరం టాపిక్స్​ చూసుకోవాలి. కెమిస్ట్రిలో ఆటమ్​, ఆసిడ్​, బేస్​, సాల్ట్​, మెటల్​ అండ్​ నాన్​మెటల్​, పీహెచ్​ స్కేల్, పీరియాడిక్​ టేబుల్​, కెమికల్​ ఫార్ములాలు స్టడీ చేయాలి. ఫిజిక్స్​లో మోషన్​,  లైట్​, గ్రావిటి, ఎనర్జి, హీట్​ టాపిక్స్​పై దృష్టి పెట్టాలి. హిస్టరీ నుంచి ఆర్ట్స్​ అండ్​ కల్చర్, బిల్డింగ్స్​ అండ్​ మాన్యుమెంట్స్​, ప్లేసెస్​, జాతీయోద్యమం, ఫేమస్​ పర్సనాలిటీస్ అంశాలు చదవాలి. జాగ్రఫీలో ఫిజికల్​, సోషల్​, ఎకనామిక్​ జాగ్రఫి ఆఫ్​ ఇండియా & వరల్డ్​ చూసుకోవాలి. పాలిటీలో ఇండియన్​ పాలిటీ, గవర్నెన్స్​ అండ్​ కానిస్టిట్యూషన్​, ఎకానమిలో ప్రభుత్వ పథకాలు, యూఎన్​ తదితర అంతర్జాతీయ సంస్థలు, ఇండియన్​ ఎకానమి, కంపెనీలు, ఆర్బీఐ తదితర అంశాలపై ఫోకస్​ పెట్టాలి. కంప్యూటర్​ అండ్​ అప్లికేషన్స్​ విభాగం నుంచి కంప్యూటర్​ గురించి బేసిక్​ ప్రశ్నలు ఇస్తారు.

స్టాటిక్​ జీకే & కరెంట్​ ఎఫైర్స్​

స్టాటిక్​ జీకేలో గవర్నర్/స్టేట్​ క్యాపిటల్​, క్యాపిటల్​ అండ్​ కరెన్సీ, రివర్స్​ అండ్​ సిటీస్​, డ్యాంలు, నేషనల్​ పార్కులు, బయోడైవర్సిటీ, అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, డిస్కవరి అండ్​ ఇన్​వెన్షన్స్​, సైంటిఫిక్​ ఇన్​స్ట్రుమెంట్స్, మిలటరీ ఆపరేషన్స్​ తదితర అంశాలు చూసుకోవాలి.​ కరెంట్​ ఎఫైర్స్​లో ముఖ్యమైన తేదీలు, కొవిడ్​–19, ఎన్​ఆర్​సీ, సీఈఈ, ముఖ్యమైన సదస్సులు, అవార్డులు, బడ్జెట్​ 2020–21, క్యాబినెట్​ మినిస్టర్స్​, స్పోర్ట్స్​​ పర్సన్స్​, అపాయింట్​మెంట్స్​ అండ్​ డెత్స్​ ఫాలో కావాలి.

జనరల్​ అవేర్​నెస్​లో ఒక్కో చాప్టర్​కు సంబంధించి నోట్స్​ ప్రిపేర్​ చేసుకొని రివిజన్​ చేస్తూ.. చదివితే బాగా ఉపయోగం ఉంటుంది. కరెంట్​ ఎఫైర్స్​ కోసం రోజూ న్యూస్​ పేపర్​ చదవడం తప్పనిసరి. దాదాపు ఎగ్జామ్​కు ముందు 9 నెలల డెవలప్​మెంట్స్​ స్టడీ చేయాలి. జీకేకు సంబంధించి విషయాలను బట్టీపట్టకుండా పరిస్థితులను, సంఘటనలను కారణాలతో నేర్చుకుంటే బాగా ఉపయోగం​ ఉంటుంది. జనరల్​ సైన్స్​ కోసం ఎన్​సీఈఆర్​టీ లేదా స్టేట్​ సిలబస్​కు సంబంధించి 8,9,10 తరగతుల బయాలజీ, ఫిజికల్​సైన్స్​ బుక్స్​ చదవాలి.

1.26 కోట్ల మంది పోటీ​

పోస్టులు: 35,208 పోస్టులకు దేశవ్యాప్తంగా దాదాపు 1.26 కోట్ల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్​తో 24,605 పోస్టులు, ఇంటర్​ క్వాలిఫికేషన్​తో 10,603 పోస్టులు ఉన్నాయి.

ఇంటర్​తో: జూనియర్​ క్లర్క్​ కమ్​ టైపిస్ట్​, అకౌంట్​ క్లర్క్​ కమ్​ టైపిస్ట్​, జూనియర్​ టైం కీపర్​, ట్రైన్స్​ క్లర్క్​, కమర్షియల్​ కమ్​ టికెట్​ క్లర్క్

డిగ్రీతో: ట్రాఫిక్​ అసిస్టెంట్​, గూడ్స్​ గార్డ్​, సీనియర్​ కమర్షియల్​ కమ్​ టికెట్ ​క్లర్క్​, సీనియర్​ క్లర్క్​ కమ్​ టైపిస్ట్​, జూనియర్​ అకౌంట్​ అసిస్టెంట్​ కమ్​ టైపిస్ట్​, సీనియర్​ టైం కీపర్​, కమర్షియల్​ అప్రెంటీస్​, స్టేషన్​ మాస్టర్​ పోస్టులు ఉన్నాయి.

Latest Updates