ఈసారి మంచి దిగుబడులు వస్తాయి: నీతి అయోగ్

పెరిగిన వరి, పత్తి, పప్పులు, నూనె గింజల సాగు

రూరల్ ఎకానమీకి బూస్ట్

నీతి అయోగ్ లెక్కల ప్రకారం 3శాతం పెరుగుదల 

మొబైల్ సబ్బులు, ఫోన్ల నుంచి బైకుల దాకా.. డిమాండ్

న్యూఢిల్లీ: దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాలనూ వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల రైతుల్లో సంతోషం కనిపిస్తోంది. ఖరీఫ్ పంటల సాగు మొదలైంది . వేగంగా నాట్లు పడుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే మనదేశంలోని నాలుగు ముఖ్యమైన పంటలైన పప్పులు, వరి వంటి ధాన్యాలు, నూనె విత్తనాలు, పత్తి పంటల దిగుబడి ఈ ఏడాది ఐదేళ్ల గరిష్టాన్ని రికార్డు చేసింది. ఖరీఫ్ లోనూ భారీగా దిగుబడులు వస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. సబ్బులు, షాంపూలు మొదలుకొని మొబైల్​ ఫోన్లు, బైకుల వరకు.. అన్నింటికీ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇండియా వ్యవసాయ ఆధారిత ఎకానమీ కాబట్టి సాగు రంగం బాగుంటే దేశం బాగుంటుంది.

ప్రస్తుత ఏడాది మే నుంచి వర్షపు జల్లులు రావడంతో రైతులు రంగంలోకి దిగారు. జూలై నాటికే 5.86 కోట్ల హెక్టార్లలో విత్తనాలు వేశారు. గత ఏడాది ఈ విస్తీర్ణం 4.02 కోట్ల హెక్టార్లను మించలేదు. అంటే సాగువిస్తీర్ణం 45 శాతం పెరిగింది. వర్షాలే వర్షాలు… ఢిల్లీలోని వాతావరణ కేం ద్రం లెక్కల ప్రకారం ఇప్పటికి 26 రాష్ట్రాల్లో ‘సాధారణం’ లేదా ‘అధిక వర్షపాతం’ రికార్డయింది. కొన్ని చోట్ల సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షం పడింది . దేశవ్యాప్తంగా 121 రిజర్వాయర్లలోకి తగినంత నీరు చేరింది. దీంతో ఈసారి కరెంటు , తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి. గత ఏడాదితో పోలిస్తే వీటిలో రెట్టిం పు నీళ్లు చేరాయని సెం ట్రల్​ గవర్నమెంటు లెక్కలు చెబుతున్నాయి.

కరోనా వల్ల బలహీనపడ్డ ఎకానమీని గాడినపెట్టగలిగిన శక్తి వ్యవసాయ రంగానికి ఉందని ఎకానమిస్టు లు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఎకానమీ గ్రోత్​రేటు భారీగా తగ్గుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే మాన్యుఫాక్చరింగ్‌‌, సర్వీసెస్‌‌ సెక్టార్లు తిరిగి పుంజుకోవడానికి చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు. కానీ, వ్యవసాయ రంగం మాత్రం శాతం పెరుగుతుందని నీతి ఆయోగ్ లెక్క గట్టింది.

బియ్యానికి ఢోకా లేదు..

ఈసారి రైతులు ఏకంగా 1.2 కోట్ల హెక్టార్లలో (ఒక హెక్టార్ 2.5 ఎకరాలకు సమానం) వరిని సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. 1.04 కోట్ల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నారు. గత ఏడాది 77 లక్షల హెక్టార్లలో మాత్రమే దీనిని వేశారు. 1.39 కోట్ల హెక్టార్లలో నూనె విత్తనాలను పండిస్తున్నారు. గత ఏడాది 75 లక్షల హెక్టార్లలో మాత్రమే వీటిని సాగు చేశారు. 64 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యా లు పండిస్తున్నారు. గత ఏడాది 24 లక్షల్లో మాత్రమే వీటిని పండించారు. ఈసారి ముందస్తుగా వర్షాలు రావడం మంచిదయిందని, రైతుల ఆదాయాలు పెరిగే అవకాశం ఉందని తమిళనాడు అగ్రికల్చరల్​ యూనివర్సిటీ ఎకానమిస్టు కేఎస్ మణి అన్నా రు. ఈసారి ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్ల అమ్మకాలు కూడా 73 శాతం పెరిగాయని ప్ర భుత్వ లెక్కలు చెబుతున్నా యి. పీఎం కిసాన్ యోజన కింద ఈ ఏడాది ఏప్రిల్‌ లో ఎనిమిది కోట్ల మంది రైతులకు రూ.రెండు వేల చొప్పున అందజేశారు.

Latest Updates