ఎండలు మండుతున్నయ్-ఈసారి రికార్డు టెంపరేచర్​​ ఇదే

సూర్యాపేటలో 45.8 డిగ్రీలు
ఈసారి రికార్డు టెంపరేచర్​​ ఇదే
వచ్చే మూడు రోజులు వడగాడ్పులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోహిణీ కార్తె దగ్గరకొస్తుండడంతో టెంపరేచర్లు ఎక్కువవుతున్నాయి. గురువారం సూర్యాపేట జిల్లాలో రికార్డ్​ టెంపరేచర్​ నమోదైంది. చింతలపాలెం మండలం దొండపాడులో 45.8 డిగ్రీల వేడి రికార్డయింది. ఈ సీజన్​లో ఇప్పటిదాకా నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోదాడ మండలం తొగర్రాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారంలో 45.6 డిగ్రీలు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 45.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాలలో 45.2 డిగ్రీల టెంపరేచర్​​రికార్డయ్యింది.

హైదరాబాద్​లోని ముషీరాబాద్​, హిమయత్​నగర్​, ఉప్పల్​, కుత్బుల్లాపూర్​​ఏరియాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. రోహిణీ కార్తె దగ్గరపడుతుండడంతో వచ్చే మూడు రోజులు టెంపరేచర్​ మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాడ్పులూ ఎక్కువయ్యే అవకాశముందని చెప్పింది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఎండలు పెరిగాయని, రాబోయే 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం లేదని చెప్పింది. టెంపరేచర్లు 43 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Updates