గోల్డ్ మెడల్ కోసమే చాలా ఎదురుచూశాం : సింధు తల్లి

స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరిగిన BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలవడంతో.. తెలుగు షట్లర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుపై అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది. హైదరాబాద్ లో పీవీ సింధు కుటుంబంలో ఆనందం అవధులు దాటింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ ఈసారి నెగ్గుతుందని తాము అనుకున్నామని చెప్పారు సింధు తల్లి పి.విజయ.

“సింధు చాలా కఠినంగా శిక్షణ పొందింది. ఈసారి తప్పకుండా గతంతో పోల్చితే మెరుగైన రిజల్ట్ వస్తుందనుకున్నాం. ఇపుడు చాలా సంతోషంగా ఉంది. ఈ గోల్డ్ మెడల్ కోసమే మేం చాలా ఏళ్లుగా ఎదురుచూశాం. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపిన్ షిప్ లో ఫైనల్ చేరడం ఆమెకు ఇది మూడోసారి. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆమె కష్టానికి ఫలితం దక్కింది” అని తల్లి పి.విజయ చెప్పారు.

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఇప్పటికే 4 మెడల్స్ సాధించింది పీవీ సింధు. 2013, 2014ల్లో సెమీస్ లో ఓడి కాంస్యం, 2017, 2018ల్లో ఫైనల్లో ఓడి సిల్వర్ మెడల్ గెల్చుకుంది.

సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో ఐదో టైటిల్ నెగ్గడం.. అందులో గోల్డ్ మెడల్ గెలవడం గర్వంగా ఫీలవుతున్నానని సింధు అక్క పూసర్ల దివ్యారాం చెప్పారు. కోచ్ లు, అభిమానులు, కుటుంబసభ్యుల మద్దతుతోనే ఇది సాధ్యమైందని చెప్పారామె.

2016 రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లోనూ సింధు సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటింది.

Latest Updates