గుట్టలు గుట్టలుగా కరోనా డెడ్ బాడీలు..వైరల్ అవుతున్న ఫేక్ వీడియో

ఇటలీలో కరోనా వైరస్ తో చనిపోయిన వారి డెడ్ బాడీలను ఖననం చేసేందుకు ప్లేస్ లేకపోవడంతో గుంటలు తొవ్వి అందులో పూడ్చిపెడుతున్నారు చూడండి అంటు నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో డెడ్ బాడీలను ప్లాస్టిక్ కవర్లతో చుట్టి గొయ్యిలో  పడేసే సన్నివేశాలు ఉన్నాయి. దీంతో నెటిజన్లు ఆ వీడియోలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ తో మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆ వీడియో ఎక్కడ నుంచి వచ్చింది..? అందులో చూపించే సన్నివేశాలు నిజమేనా అన్న అంశాలపై యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ లో చెక్ చేయగా..ఆ వీడియో ఫేక్ అని తేలింది. ఆ వీడియో 2007లో పాండమిక్ అనే టీవీ సిరీస్ లోని సన్నివేశాలని తేలింది. బర్డ్ ఫ్లూ జాతికి చెందిన రిప్టైడ్ వైరస్ ఉంది. దాని ఆధారంగా తీసిన షార్ట్ ఫిల్మిం. ఆ షార్ట్ ఫిల్మింలోనే రిప్టైడ్ వైరస్ తో చనిపోయిన వారి డెడ్ బాడీలను సమాధి చేసేందుకు పెద్ద పెద్ద గుంటలు తొవ్వి అందులో ఉంచుతారు. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ వీడియోలోని డెడ్ బాడీ సన్నివేశాల్ని ఫేస్ బుక్ యూజర్ మొయినుద్దీన్ హాసన్ షేర్ చేశారు. కరోనా వైరస్ సోకిన డెడ్ బాడీలని క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సతీష్ రాథోడ్ అనే మరో ట్వీట్టర్ యూజర్ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇటలీలో కరోనా వైరస్ సోకి మృతిచెందిన డెడ్ బాడీలను చూస్తుంటే భయంకరంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అని తేలింది.

Latest Updates