ఉమెన్స్ టీ20 వరల్డ్‌‌కప్‌ రికార్డు

ఉమెన్స్ క్రికెట్‌‌లో మోస్ట్‌ వ్యూస్ సొంతం

దుబాయ్‌: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో జరిగిన ఉమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌ అరుదైన రికార్డు సృష్టించింది. ఆసీస్‌‌ విజేతగా నిలిచిన ఈ టోర్నీ మహిళల క్రికెట్‌‌ హిస్టరీలోనే ఎక్కువ మంది వీక్షించిన ఈవెంట్‌‌గా నిలిచిందని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఐసీసీ డిజిటల్‌‌ చానెల్స్‌‌లో ఈ టోర్నీకి సంబంధించి 1.1 బిలియన్‌‌ వీడియో వ్యూస్‌‌ రికార్డయ్యాయని తెలిపింది. గత టీ20 వరల్డ్‌‌కప్‌‌ (2018)తో పోల్చితే ఈ వ్యూవర్‌‌షిప్‌‌ 20 రెట్లు ఎక్కువ కావడం విశేషం. మహిళల క్రికెట్‌‌ చరిత్రలో ఇప్పటి దాకా మోస్ట్‌‌ సక్సెస్‌‌ఫుల్‌‌ ఈవెంట్‌‌గా ఉన్న 2017 వన్డే వరల్డ్‌‌ కప్‌‌ కంటే ఈ టోర్నీకి పది రెట్లు ఎక్కువగా వీడియో వ్యూస్‌‌ వచ్చాయని ఐసీసీ చెప్పింది. కాగా, ఈ రెండు టోర్నీల్లోనూ ఇండియా రన్నరప్‌‌గా నిలవగా.. మన జట్టు ఫైనల్‌‌కు రావడంతో వ్యూవర్‌‌షిప్‌‌ భారీగా పెరిగిందని ఐసీసీ పేర్కొన్నది.

For More News..

లాక్‌‌డౌన్ సడలించినా షాపింగ్ చేయట్లే..

కలిసి ఆడి.. కరోనా అంటిచ్చుకున్నరు