వైరల్: ఏలియన్ లాంటి బెలూన్.. జడుసుకున్న జనాలు

గ్రేటర్ నోయిడా: హాలీవుడ్ సూపర్ హీరో ఐరన్ మ్యాన్‌‌ షేప్‌‌లో ఉన్న బెలూన్‌‌ను చూసి గ్రేటర్ నొయిడాలోని ధన్‌‌కౌర్ టౌన్ ప్రజలు జడుసుకున్నారు. వివరాలు.. నొయిడా, ధన్‌‌కౌర్‌‌ భట్టా పర్సౌల్‌‌ గ్రామంలోని కెనాల్‌‌లో శనివారం ఉదయం ఓ బెలూన్ గాలిలో తేలుతూ వచ్చి పడింది. అయితే మామూలు బెలూన్లలా కాకుండా వింతైన ఆకారంలో ఉండటం, కదులుతుండటంతో అందరూ దాన్ని చూసి భయపడ్డారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు దాన్నో బెలూన్‌‌గా గుర్తించారు. ఈ వింతైన బెలూన్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

గ్యాస్‌‌తో నిండిన సదరు బెలూన్ ఐరన్‌‌మ్యాన్ లాంటి వింతైన షేప్‌‌లో ఉండటంతోనే అందరూ దాన్ని ఏలియన్ అనుకున్నారని అధికారులు చెప్పారు. ‘గాలితో నిండిన బెలూన్ అది. అది పైకెళ్లి మళ్లీ కిందకు వచ్చి నీళ్లలో పడి ఊగసాగింది. బెలూన్ కదలడాన్ని చూసిన ప్రజలు ఉత్సుకతకు లోనయ్యారు. ముఖ్యంగా అది వింత రూపంలో ఉండటమే జనాల యాంగ్జైటీకి కారణం. అది ఐరన్ మ్యాన్‌‌ షేప్‌‌లో ఉంది. అది వైవిధ్యంగా ఉండేసరికి దాన్ని ఏలియన్ అనుకున్నారు. కానీ అదో బెలూన్ మాత్రమే. దాంతో ఎలాంటి సమస్య లేదు’ అని ధన్‌‌కౌర్ పోలీసు అధికారి అనిల్ కుమార్ పాండే చెప్పారు.

Latest Updates