సీఎంఎస్‌‌లో వెయ్యి కొత్త ఉద్యోగాలు

‌న్యూఢిల్లీ: ఏటీఎంలలో క్యాష్‌‌ను నింపడం వంటి క్యాష్‌‌ మేనేజ్‌‌మెం ట్‌ సర్వీసెస్‌‌లను అందించే కంపెనీ సీఎంఎస్, వచ్చే రెండు నెలల్లో వెయ్యి మందిని నియమించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరింత మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వీరి శాలరీ నెలకు రూ. 30 వేల పైనే ఉంటుందని సీఎంఎస్‌‌ తెలిపింది. తమతో కలిసి పనిచేస్తున్న బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు, మైక్రో ఫైనాన్స్‌‌ల కోసం డబ్బులను కలెక్ట్‌‌ చేసే బిజినెస్‌‌లోకి కూడా రానుంది. కస్టమర్ల నుంచి డబ్బులు, చెక్‌‌లను కలెక్ట్‌‌ చేసేందుకు ఇప్పటికే మహింద్రా ఫైనాన్స్‌‌, ఎల్‌‌ అండ్‌‌ టీ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

 

Latest Updates