తిండిలేక చేతిలో డబ్బుల్లేక.. బ్రిటన్లో మనోళ్ల ఆకలి కేకలు

బ్రిటన్ లో చిక్కుకుపోయిన వేలాది మంది ఇండియన్ స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక, అద్దెలు కట్టలేక నరకం అనుభవిస్తున్నారు. లాక్ డౌన్ తో వారి పార్ట్టైమ్ జాబ్స్ పోయినయి. మరోవైపు దగ్గరున్న పైసలన్నీ అయిపోయినయి. దీంతో నిత్యావసరలు  కూడా కొనుక్కోలేకపోతున్నారు. ఫుడ్ కోసం చారిటీలపైనే ఆధారపడుతున్నారు. వారు పెట్టే తిండితోనే కడుపునింపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బ్రిటన్ లోని స్టూడెంట్ గ్రూప్స్ వీరికి అండగా నిలుస్తున్నాయి.ఫుడ్ అందజేస్తూ ఆదుకుంటున్నాయి. ఇప్పటి వరకు 3వేల మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశామని ఇండియన్నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలిపింది. తమకు చాలామంది నుంచి ఫుడ్ కావాలని కాల్స్ వస్తున్నాయని ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలూమ్నియూనియన్ పేర్కొంది. ‘‘చాలామంది స్టూడెం ట్లుఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ల దగ్గర తినడానికికూడా డబ్బుల్లేవు” అని సేవా ట్రస్టుకు చెందిన చరణ్సెఖాన్ చెప్పారు. ఎవరిని సంప్రదించాలో, ఎలా సంప్రదించాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంతమంది మానసికంగా కుంగిపోయి సూసైడ్ ఆలోచనలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్లను యూనివర్సిటీలు ఆదుకోవాలని ఈలింగ్ సౌతాల్లేబర్ ఎంపీ వీరేంద్ర శర్మ కోరారు. ఫండ్స్ విడుదలచేయాలని, స్టూడెంట్లకు సహాయం అందజేయాలని ఎడ్యు కేషన్ సెక్రటరీకి లెటర్ రాశారు.

Latest Updates