‘29న ప్రకాశ్ రాజ్, కుమారస్వామిని చంపేస్తాం‘

కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, యాక్టర్ ప్రకాశ్ రాజ్ ,సీపీఎం నేత బృందాకారత్ తో పాటు మరో 12 మందిని చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నిజాగుననాడ స్వామీజీ మఠానికి ఈ లేఖ వచ్చింది. కన్నడలో ఉన్న ఈ లేఖలో  దేశద్రోహులను జనవరి 29 నుంచి ఒక్కొక్కరిని ఖచ్చితంగా చంపేస్తామంటూ హెచ్చరించారు. నిజాగుననాడ స్వామీజీ మీరు ఒక్కరే కాదు మీతో పాటు మిగతా వారిని కూడా చంపేస్తామన్నారు. మీ చివరి ప్రయాణానికి అందరినీ సిద్ధంగా ఉంచాలన్నారు. బెదిరింపు లేఖలో  ప్రకాశ్ రాజ్, కుమార స్వామి, బృందా కారత్ తో  పాటు మాజీ బజరంగ్ దళ్ నాయకుడు మహేంద్ర కుమార్, నిజాగుననాడ అసురి స్వామి, నిడుమామిడి వీరభద్ర చెన్నమల్ల స్వామి (అసురి),  జ్ఞానప్రకాష్ అసురి స్వామి, చేతన్ కుమార్ (నటుడు), BT లలితా నాయక్, ప్రొఫెసర్ మహేష్‌చంద్ర గురు , ప్రొఫెసర్ భగవాన్ (ఇద్దరూ మైసూర్), దినేష్ అమిన్ మట్టు, చంద్రశేఖర్ పాటిల్, దుండి గణేష్, రౌడీ అగ్ని శ్రీధర్ ఉన్నారు.

see more news

 టైరులో ఇరుక్కుపోయి నానావస్థలు పడ్డ కుక్కపిల్ల

సంచలన స్కామ్..రూ. 4,26,000 కోట్లు లూటీ

Latest Updates