ఇస్రో మాజీ ఛైర్మన్‌ కు బెదిరింపు లేఖ

ఇస్రో మాజీ ఛైర్మన్‌, బీజేపీ సభ్యుడు జి మాధవన్‌ నాయర్‌ను హతమారుస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. దీనిని లేఖను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ అంశంపై మాధవన్‌ను ప్రశ్నించగా లేఖ గురించి తనకేమీ తెలియదని, అయితే దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్‌ నివేదిక ఉందని తనకు చెప్పారని ఆయన అన్నారు. ఇస్రో ఛైర్మన్‌గా 2009లో పదవీ విరమణ చేసిన మాధవన్‌ ఆ తర్వాత బీజేపీలో చేరారు.

 

Latest Updates