పుల్వామాలో ఎన్‌కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టులు హతం

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో జమ్ము కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ జవాన్లు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ముష్కరులు కాల్పులకు దిగడంతో బలగాలు ఎదురుదాడి ప్రారంభించాయి. గంటల కొద్దీ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు ముగ్గురు ‘అన్సర్ ఘజ్వా ఉల్ హింద్’ ముష్కర సంస్థకు చెందినవారని గుర్తించారు పోలీసులు. మృతులను జంజీర్ రఫీక్ వనీ, ఉమర్ మఖ్బూల్ భట్, ఉజియార్ అమీన్ భట్‌ అని తెలిపారు.

Latest Updates