తిరుమల కొండపై చర్చ్ అంటూ అసత్య ప్రచారం

తిరుమల కొండపై చర్చి అంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫారెస్ట్ సెల్ టవర్ ను చర్చి అంటూ సోషల్ మీడియాలో  ప్రచారం చేసిన నలుగురు వ్యక్తులు అరుణ్, కార్తీక్ , అజిత్ లను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు. పారెస్ట్ సెల్ టవర్ బిల్డింగును చూపెడుతూ.. ఇదిగో దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని పోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసినట్లు చెప్పారు పోలీసులు. అరుణ్ కాటేపల్లి అనే ఫేస్ బుక్ పేజీ నుంచి ఫోటోలను పోస్ట్ చేసినట్లు చెప్పారు.

Latest Updates