హైవే పై ఢీ కొన్న లారీ, మూడు కార్లు

వేగంగా వస్తూ  ఓ ఇసుక లారీ, మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం దగ్గర హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై జరిగింది. అతివేగంతో ఒకదాని వెనుక ఒకటి  వెళ్తూ కార్లు, లారీ ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  గాయపడిన వారిని నకిరేకల్ లోని  ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్ స్తంభించింది. డామేజ్ అయిన కార్లను జేసీబీ సాయంతో రహదారిపై నుంచి తొలగించి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు.

Latest Updates