టీఆర్ఎస్ లోకి మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

  • పరిషత్ ఎన్నికల్లో పే చేరిక సర్వీసెస్‌ అసోసి యేషన్‌
  • 13 కు చేరనున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య
  • ఆరుకు పడిపోనున్న కాంగ్రెస్​ బలం
  • జూన్​లోపు సీఎల్పీ విలీనానికి టీఆర్ ఎస్​ వ్యూహం

మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్​లో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే వారు కారెక్కుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఉత్తర తెలంగాణలోనే అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న ఓ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఇప్పటికే టీఆర్ఎస్​ ముఖ్య నేతలతో మంతనాలు పూర్తి చేసుకున్నారు. తన సతీమణికి జడ్పీచైర్ పర్సన్​ పదవిని అధికార పార్టీ ఆఫర్ చేయడంతో ఆయన గులాబీ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇక రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నఓ అటవీ ప్రాంత ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది.తనకు సంబంధించిన విలువైన ఓ ల్యాండ్ కేసు సెటిల్చేస్తామని అధికార పార్టీ నుంచి వచ్చిన హామీ మేరకు ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నఓ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్​ను వీడేందుకు రెడీగా ఉన్నట్లు, ఇప్పటికే ఆయన అధికార పార్టీ యువనేతతో చర్చలు సాగించినట్లు ప్రచారంలో ఉంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సదరు ఎమ్మెల్యే అన్నీ తానై పనిచేశారు.

జూన్ లోపు విలీనం!

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆత్రం సక్కు, రేగా కాంతారావు, బానోతు హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డి, వనమావెంకటేశ్వర్ రావు, సుధీర్ రెడ్డి, జాజుల సురేందర్ ఉన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పే కొత్తగాముగ్గుర్ని టీఆర్ఎస్​లో చేర్చుకొని మరోసారి కాంగ్రెస్ నేతలకు ఝలక్ ఇవ్వాలని గులాబీ నేతలు వ్యూహా రచన చేస్తున్నారు. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా తమ వైపే ఉంటాయని భావిస్తున్నారు.ఈ ముగ్గు రితో కలిపి టీఆర్ఎస్ బాటపట్టిన కాంగ్రెస్​ ఎమ్మె ల్యేల సంఖ్య 13 కు చేరుకుంటుంది. కాంగ్రెస్​ శాసనసభా పక్షాన్ని(సీఎల్పీ) టీఆర్ ఎస్ లో విలీనంచేసేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉండటంతోఆ విలీన ప్రక్రియను కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం కోసం జూన్ మొదటి వారంలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో పే పూర్తి చేయాలని అధికార పార్టీ​ భావి స్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Latest Updates