అస్సాంలో మూడు రోజుల ట్రావెల్‌ విండో

  • లాక్‌డౌన్‌ వల్ల ఇరుక్కుపోయిన లక్ష మందిని
  • సొంత ఊళ్లకు చేర్చేందుకు

గౌహతి: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రదేశాల్లో ఇరుక్కుపోయిన వారికి అస్సాం ప్రభుత్వం ఊరట కల్పించింది. మూడు రోజుల ట్రావెల్‌ విండోను ఏర్పాటు చేసి దాదాపు లక్ష మందిని తమ సొంత ఊళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 25 నుంచి 27 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు లక్ష పాసులు జారీ చేసిందని అధికారులు చెప్పారు. షడన్‌ లాక్‌డౌన్‌ వల్ల ఇరుక్కుపోయిన వలస కూలీలకు కూడా పాస్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. వేరే జిల్లాల్లో వర్క్‌కు వెళ్లాల్సిన ఎంప్లాయిస్‌, పేషంట్లు తదితరులకు అవసరాన్ని బట్టి పాసులు జారీ చేస్తున్నామని అధికారులు చెప్పారు. ట్రావెల్‌ చేయాలనుకున్న వారు జిల్లా అధికారులకు అప్లికేషన్‌ పెట్టుకుంటే దాన్ని పరిశీలించి కచ్చితమైన రీజన్‌ ఉంటేనే పాస్‌ జారీ చేస్తున్నామన్నారు. సొంత వాహనాలు ఉన్నవారు 51వేల మంది పాస్‌ల కోసం అప్లై చేసుకోగా.. శనివారానికి 12వేలు పాస్‌లు ఇచ్చారు. సొంత వాహనాలు లేని 41 వేల మంది కూడా పాస్‌ కోసం అప్లై చేసుకున్నారని, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Latest Updates