‘సైరా‘ ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్

  • ముగ్గురు అభిమానులకు గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం

జీడిమెట్ల, వెలుగు: సైరా సినిమా ఫ్లెక్సీ కడుతున్న ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ తో గాయపడ్డారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..చింతల్ లోని వాజ్ పేయి నగర్ కి చెందిన ప్రశాం త్(23) స్టూడెంట్.అదే ప్రాంతానికి చెందిన చిరంజీవి(30),రమేశ్(27) అన్మదమ్ములు. నేడు యాక్టర్ చిరంజీవి సైరా సినిమా నేపథ్యం లో మంగళవారం సాయంత్రం ఈ ముగ్గురు వాజ్ పేయి నగర్ లోని తమ ఇంటిపై ఫ్లెక్సీ కడుతుడంగా కరెంట్ వైర్లు తగిలి విద్యాదా ఘాతానికి గురయ్యారు. కరెంట్ షాక్ తో కిందపడ్డ వీరినిస్థానికులు బాలానగర్ లోని ఓ హాస్పిటల్ కి తరలించారు. వీరిలో చిరంజీవి, రమేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

Latest Updates