రాజస్థాన్ పడవ ప్రమాదంలో ముగ్గురు మృతి… 12 మంది గల్లంతు

రాజస్థాన్‌లోని ఖటోలీలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బుండి జిల్లాలోని కమలేశ్వర్‌ మహదేవ్‌ ఆలయానికి 40 మంది భక్తులతో వెళ్తున్న పడవ చంబల్‌ నదిలో మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న వారిలో ముగ్గురు చనిపోగా దాదాపు 12 మంది గల్లంతు అయ్యారు. మరో 25 మంది సురక్షితంగా బయటపడ్డారు.

బుండి జిల్లాలోని ఇందర్‌ ఘర్‌ ప్రాంతంలో ఉన్న దేవస్థానానికి 40 మంది పడవలో బయలుదేరారు. చంబల్‌ నది ద్వారా వెళ్తుండగా ప్రమాదవశాత్తు పడవ నీట మునిగి పోవడంతో ముగ్గురు మృతి చెందగా…దాదాపు 12 మంది గల్లంతయ్యారు. మరో 25 మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కోట రూరల్‌ ఎస్పీ శరద్‌ చౌదరీ తెలిపారు.

Latest Updates