కానిస్టేబుల్ ప్రాణం తీసిన అమ్మాయిల టిక్ టాక్ పిచ్చి

ఓ యువకుడు ఇద్దరు యువతుల టిక్ టాక్ పిచ్చి కానిస్టేబుల్ ప్రాణాల్ని తీసింది. పాకిస్తాన్ గుజరాత్ లోని భగోవాల్ కు చెందిన హాసాన్ షహజాద్  కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే  గుజరాత్ యూనివర్సిటీకి చెందిన అతని ముగ్గురు స్నేహితులైన యువకుడు ముహమ్మద్ వలీద్, స్నేహితురాళ్లు  లైబా జాహిద్, రీసా జావేద్ సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్య అతని ఇద్దరి స్నేహితురాళ్లు షాసాన్ వద్ద లోడ్ చేసిన పిస్తోల్ తీసుకొని  టిక్ టాక్ చేసేందుకు ప్రయత్నించారు. టిక్ టాక్ చేస్తుండగా ఒక్కసారిగా లోడ్ చేసిన గన్ పేలింది. ఈ ఘటనలో బుల్లెట్ తగిలి కానిస్టేబుల్ షాసాన్ కుప్పకూలిపోయాడు. దీంతో భయాందోళనకు గురైన ముహమ్మద్ వలీద్,  లైబా జాహిద్, రీసా జావేద్ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు  బాధితుణ్ని టీచింగ్ హాస్పటల్ కు తరలించారు. షాసన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కాల్ లిస్ట్ ఆధారంగా నిందితులు గుర్తింపు

షాసాన్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో బాధితుడు ఫోన్ లో రికార్డ్ అయిన ఆడియో ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తించారు. గుజరాత్ యూనివర్సిటీలో ఉన్న  ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు

Latest Updates