నిజామాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి దర్పల్లికి వచ్చి పెళ్లి వేడుకల్లో పాల్గొని నిజామాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులున్నట్లు తెలిపారు. మృతులను నిజామాబాద్‌ జిల్లాకు చెందిన గౌతమ్‌రెడ్డి, నిఖిల్‌, బాలకృష్ణగా గుర్తించారు. గాయపడినవారిలో అదే జిల్లాకు చెందిన సాయి సాకేత్‌, హరీష్‌, శ్రవణ్‌లు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో చదవుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates