పెట్రోల్ బంక్‌లో కరెంట్ షాక్.. ముగ్గురు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఘోరం జరిగింది. రామచంద్రపురం హైవే పక్కనున్న ఓ పెట్రోల్‌ బంకులో  కరెంట్ షాక్ తో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పెట్రోల్ పంప్ లో  ఇనుప స్టాండ్ సాయంతో పాడైన బల్బును మారుస్తుండగా స్టాండ్ హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.  డేరంగుల శ్రీనివాసరావు(45), షేక్‌ మౌలాలి(22) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  శేఖర్‌ (48) ప్రాణాలు కోల్పోయాడు. మృతులు బొప్పూడి, పోలిరెడ్డిపాలెం వాసులుగా గుర్తించారు పోలీసులు.

Latest Updates