తెలంగాణపై బాకీల బరువు

రూ. 3 లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర సర్కారు అప్పు
ఆరేండ్లలో నాలుగున్నర రెట్లు పెరుగుదల

హైదరాబాద్, వెలుగు: అప్పుల మోత మోగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఆందోళన కలిగించే స్థాయిలో పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల కుప్ప మొత్తం రూ. 3.18 లక్షల కోట్లు దాటనుంది. చట్ట ప్రకారం ఎఫ్ఆర్​బీఎం పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులు కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 2.29 లక్షల కోట్లకు చేరుతాయి. బడ్జెట్​లో ఆర్థిక శాఖ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇరిగేషన్​ ప్రాజెక్టులు, మిషన్‌‌ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే రూ. 89,600  కోట్ల రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది. కార్పొరేషన్ల పేరిట తీసుకున్న ఈ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత చివరికి రాష్ట్ర  ప్రభుత్వంపైనే ఉంటుంది. బడ్జెట్​లో పెట్టకుండా చేసిన ఈ అప్పులన్నీ ఏటా తడిసి మోపెడవుతున్నాయి. వీటిని సైతం రాష్ట్రం అప్పుల ఖాతాలో జమ కడితే మొత్తం అప్పు రూ. 3,18,600 కోట్లు అవుతుంది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్‌‌డీపీలో 25 శాతం మించకూడదు. అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడున్న అప్పుల తీరు చేస్తే ఈ హద్దులు దాటినట్లేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ  ఏర్పడ్డప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ. 70 వేల కోట్లు. గడిచిన ఆరేండ్లలో ఈ అప్పు నాలుగున్నర రెట్లు పెరిగిపోయింది.

తలసరి అప్పు రూ.91 వేలు

రాష్ట్ర సర్కారు చేసే అప్పులతో ఏటా తలసరి అప్పు పెరిగిపోతోంది. ప్రభుత్వం చేసిన అప్పులు ఒక్కొక్కరికి పంచితే.. తలసరి అప్పు రూ. 91,019గా నమోదవుతోంది. రాష్ట్రంలో మొత్తం జనాభా
3.50 కోట్లు.

Latest Updates