జార్ఖండ్ ఎన్ కౌంటర్ లో  ముగ్గురు మావోయిస్టులు మృతి

భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోస్టులు మృతి చెందారు. జార్ఖండ్ ఇవాళ(శనివారం) ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు  చనిపోయారు. పశ్చిమ సింగభం జిల్లాలో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. విషయాన్ని పసిగట్టిన నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Latest Updates