టిక్ టాక్: ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్

three-medical-department-employees-suspended

ఉద్యోగులు విధులను వదిలి టిక్ టాక్ మాయలో పడి..తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్నారు. కరీంనగర్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు టిక్‌టాక్‌లో నటించడంతో వారి పై వేటు పడింది. వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా దివ్యమణి, సమత… ల్యాబ్ అసిస్టెంట్‌ జయలక్ష్మి ఉన్నారు. వీరు విధుల్లో ఉండగా టిక్ టాక్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాంమనోహర్ రావు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates