పాతబస్తీలో దారుణం.. మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు అత్యాచారం

హైదరాబాద్  పాతబస్తీలో దారుణం జరిగింది. మతిస్థిమితంలేని ఓ యువతిపై ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. కుల్సుంపురాకు చెందిన యువతి…గత నెల 26న ఇంట్లోంచి బయటికి వెళ్లింది. పురానాపూల్  చౌరస్తా సమీపంలో నిల్చొని ఉన్న యువతిని… ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మించి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

యువతి తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించి భరోసా సెంటర్ కు తరలించారు. విచారణ చేపట్టిన పోలీసులు గత నెల 26న నజీర్ అనే వ్యక్తి యువతిని పురానాపూల్ చౌరస్తాలో వదిలేసి వెళ్లినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. సీసీ ఫుటేజీ, స్థానికులు ఇచ్చిన ఆధారాలతో ఈ దారుణానికి పాల్పడిన ఖలీల్, అజీజ్, నజీర్ లను పోలీసులు అరెస్టు చేశారు.

Three men arrested for raping mentally disabled woman

Latest Updates