తినడానికి రైస్ లేదని కోబ్రాను వేటాడారు

సోషల్ మీడియాలో వీడియో వైరల్
పరారీలో నిందితులు
గుహవాటి: అరుణాచల్ ప్రదేశ్ లో ముగ్గురు వేటగాళ్లు 12 అడుగుల కింగ్ కోబ్రాను తమ భుజాలపై వేసుకొని తీసిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. అక్కడి అడవుల్లో ఆ భారీ పామును వీళ్లు వేటాడినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు వీడియోలో మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా తినడానికి రైస్ లేదని, అందుకే దగ్గరలోని అడవిలో దేన్నయినా వేటాడటానికి వెళ్లామన్నాడు. సరిగ్గా ఆ టైమ్ లో కింగ్ కోబ్రా కనిపించడంతో వేటాడామన్నాడు. ఈ ముగ్గురిపై అధికారులు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్​ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని అఫీషియల్స్ చెప్పారు. చట్ట ప్రకారం కింగ్ కోబ్రాను చంపితే నేరానికి పాల్పడినట్లే. బెయిల్ కూడా రాదు. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన అరుణాచల్ లో అంతరించిపోతున్న పాములు ఎక్కువ సంఖ్య లో ఉన్నాయి. ఈమధ్యే ఆ రాష్ట్రంలో శాస్త్రవేత్తలు కొత్తగా ఓ విషపు పామును కనుగొన్నారు. దానికి ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ సృష్టించిన హ్యారీ పాటర్ సినిమాలోని ‘సలాజర్ స్లిథెరిన్’ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ పేరును స్ఫూర్తిగా తీసుకున్నారు. పక్కె టైగర్ రిజర్వ్ లోని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో జూలై 2019లో కనుగొన్న ఈ పాముకు ‘ట్రిమరెసురస్ సలాజర్’ అనే పేరును పెట్టారు.

Latest Updates