నవంబర్ 5న భారత్ రానున్న మరో 3 రాఫెల్ జెట్స్

భారత వైమానిక దళానికి త్వరలో మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. నవంబర్ 5వ తేదీన ఫ్రాన్స్ నుంచి మూడు రాఫెల్ యుద్ధ విమానాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇవి ఫ్రాన్స్ నుంచి నేరుగా అంబాలా విమానాశ్రయానికి చేరుకోనున్నాయి.

గత జూలై 29న అబుదబీ మీదుగా 5 రాఫెల్స్ జెట్లు భారత్‌కు వచ్చాయి. సెప్టెంబర్ 10న అంబాలా ఎయిర్‌బోస్‌లో ఈ ఐదు రాఫెల్ జెట్లను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లె, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. 2016లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం భారత్‌కు 36 రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ అప్పగించాల్సి ఉంది. 2021 ఏప్రిల్‌ వరకు మరో 16 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు రానున్నాయి.

Latest Updates