హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

  • కొలిజీయం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం

హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లకు ఆమోదముద్ర వేశారు. జస్టిస్ టి.వినోద్ కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ ఏ.అభిషేక్ రెడ్డిలను నియమిస్తూ  కేంద్ర న్యాయ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేందర్ కశ్యప్ ఉత్తర్వులిచ్చారు. జడ్జిలుగా ప్రమాణ స్వీకారంచేసిన నాటినుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ ముగ్గురితో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14 కు చేరనుంది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ తో కలిపి 11 మంది న్యాయమూర్తులు ఉన్నారు.

Latest Updates