నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి ముగ్గురు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన ఒక కుటుంబం హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల శివారులోకి రాగానే అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Latest Updates