ఘోర ప్రమాదం: బైక్ ను లారీ ఢీకొట్టి 3 కి.మీ. ఈడ్చుకెళ్లింది

 విశాఖ : ఎస్ రాయవరం మండలం ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ట్రిపుల్ రైడ్ చేస్తూ.. రోడ్డు దాటుతున్న  ముగ్గురిని… ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో… బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అత్యంత దారుణ పరిస్థితుల్లో చనిపోయారు.

ఫాస్ట్ గా వస్తున్న లారీని బైకర్లు చూసుకోలేదు. లారీ ఢీకొట్టడమే కాదు… బైక్ ను 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుపోయింది. ఒక్కో డెడ్ బాడీ మీదనుంచి లారీ దూసుకెళ్లింది. ఈ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక్కో బాడీ ఒక్కో చోట పడిపోయింది.  ఒక యువకుడి మృతదేహం లారీ ముందుభాగంలోనే బైక్ తో పాటే ఉండిపోయింది. కొద్దిదూరం వెళ్లాక గానీ డ్రైవర్ కు జరిగిన ప్రమాదం అర్థం కాలేదు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతులను కార్తీక్, సాయి , నవీన్ లు గా గుర్తించారు. మృతుల బంధువుల ఏడుపులతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.

Latest Updates