
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు తూర్పు ఘంజీ ప్రావిన్సులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఇవాళ(శనివారం) ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసు అధికారులు చనిపోగా… మరో 12 మంది పోలీసులు గాయపడ్డారు. అంతేకాదు దాడితో కార్యాలయం పాక్షికంగా దెబ్బతిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో తాలిబన్లు దొంగిలించిన ఓ సైనిక వాహనం ఉపయోగించుకొని ఈ దాడి జరిపినట్లు తెలిపారు. అయితే, ఈ దాడికి తామే కారణమని తాలిబన్ సంస్థ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఘంజీ ప్రావిన్సులో తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక సగానికిపైగా అఫ్గానిస్థాన్‌లో వీరి కదలికలు ఉన్నాయి. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఇక్కడ ఎక్కువగా దాడులు జరుగుతుంటాయి.