శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్..ముగ్గురు తమిళ స్మగ్లర్లు అరెస్ట్

తిరుపతిలోని శేషాచలం అడవుల్లో  భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ లింగాధర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భాకరాపేట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.పావురాల గుట్టవద్ద 20 మంది స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించగా.. ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్నారు. తమిళనాడు  తిరుమన్నామలై జిల్లా మేలక్కబ్ నూరుకు చెందిన శ్రీనివాసులు, కౌలకుసునూర్ కు చెందిన సంతోష్, వాలదంబైకి చెందిన జేవేలును అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత 20 రోజుల క్రితం వీరంతా శేషాచలం కొండల్లోని బొమ్మాజీకొండ ప్రాంతంలో  ఏ గ్రేడ్ దుంగలను నరికినట్లు ఒప్పుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు 800 కేజీలు ఉంటాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పారిపోయిన మిగతా  స్మగ్లర్ల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు.

కరోనా పంజా.. ఒకే రోజు 95,735 కేసులు..1172 మరణాలు

విశాఖ: వరహ నదిలో బోల్తాపడ్డ బస్సు

తలకాయ లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు

Latest Updates