యువతరానికి ఇన్​స్పిరేషన్..ఈ పోలీస్​ సిస్టర్స్

‘మౌనిక.. ప్రియాంక.. రాధిక… మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. చిన్నప్పుడే నాన్న ఇల్లు వదిలి వెళ్లిపోయిండు. ఆయన కోసం వెతకని రోజంటూ లేదు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చినం. చాలా చోట్ల వెతికినం. లాభం లేదు.  అమ్మ రేణుక. ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. తను కస్తూర్బా నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌లో పనిచేస్తోంది. మేం నలుగురం.  అందరం డిగ్రీ చదివినం. అమ్మ కష్టం చూసి ఎలాగైనా గవర్నమెంట్​ జాబ్​ కొట్టాలనుకున్నం. కానిస్టేబుల్​ నోటిఫికేషన్ పడింది.  అందరం కలిసి ఫ్రీ కోచింగ్​ తీసుకున్నం. ప్రిలిమ్స్​.. ఈవెంట్స్​.. మెయిన్స్​.. అన్నీ దాటేసినం.  ముగ్గురం పోలీసులైనం. అన్నయ్య గణేష్​ కూడా మాతోనే   ప్రిపేరయిండు.  కానీ హైట్ సరిపోలేదు.  అమ్మ పడ్డ కష్టమే.. మాలో  పట్టుదల నింపింది. ’ అంటున్న ఈ అక్కా చెల్లెళ్లు నేటి యువతరానికి ఇన్​స్పిరేషన్​.  కష్టాలు కన్నీళ్లున్న  కుటుంబమైనా.. పట్టుదలతో చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చాటిచెప్పిన  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ శివరాంపల్లికి చెందిన ఈ ముగ్గురి సక్సెస్ స్టోరీ​.. వారి మాటల్లోనే..  

డిగ్రీ పూర్తయ్యాక ఎంఎస్సీ జువాలజీ చదవుతున్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రిపేరయ్యాను కానీ సరిగ్గా టార్గెట్ మీద ఫోకస్ చేయలేదు. దీంతో ఆ జాబ్ నాకు రాకుండా పోయింది. వచ్చిన అవకాశాన్ని చేతులారా చేజార్చుకున్నా అని చాలా బాధపడ్డా. కానీ ఈసారి నోటిఫికేషన్ వస్తే అలా చేయకూడదని డిసైడయ్యా. ఇంతలో మళ్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ కానిస్టేబుల్, ఎస్‌‌ఐ ప్రిపేరయ్యేవాళ్ల కోసం ఫ్రీ కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేశారు. అందులో నాతోపాటు మా చెల్లెళ్లు జాయిన్ అయ్యారు. 3నెలలపాటు ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ కోచింగ్ ఇచ్చారు. ప్రాక్టీస్ టెస్టులు, వీక్లీ టెస్టులు పెట్టేవారు. ఓఎంఆర్ షీట్ ఎలా, ఎంత వేగంగా బబుల్ చేయాలో చెప్పేవారు. మాతోపాటే కోచింగ్ తీసుకున్న 9మందితో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గ్రూప్ స్టడీ చేసేవాళ్లం. పొద్దున్నే లేచి గ్రౌండ్‌‌కు వెళ్లేవాళ్లం. అది అయ్యాక అక్కడే కూర్చుని చదివేవాళ్లం. తెలంగాణ మూవ్‌‌మెంట్, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇలా అన్ని సబ్జెక్టులు కవర్ చేశాం. ఎవరికి డౌటున్నా చెప్పుకునేది. యూట్యూబ్‌‌లో క్లాసులు వినేవాళ్లం. హ్యాపినెస్ ఏంటంటే గ్రూప్ స్టడీ చేసిన మా అందరికీ జాబులొచ్చాయి. కానిస్టేబుల్‌‌తోపాటు ఎస్‌‌ఐ ఎగ్జామ్ కూడా రాశా. కానీ పదిమార్కుల తేడాతో రాలేదు. నా నెక్ట్స్ టార్గెట్ ఎస్‌‌ఐ. అది రీచ్ అయ్యే వరకు ఇలాగే కష్టపడుతుంటా.

ముుగ్గురిలో నేను మిడిల్. అక్కా చెల్లె ఇద్దరూ కానిస్టేబుల్ కోసం ప్రిపేరవడం చూసి నేను వారితో చేరిపోయా. 2017లో డిగ్రీ పూర్తయింది. 6 నెలలు రామకృష్ణ మఠ్‌‌లో స్పోకెన్ ఇంగ్లీష్‌‌లు విన్నా. అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. అదే ఫస్ట్ టైం నేను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేరవడం. ఫ్రీ కోచింగ్‌‌కు వెళ్లడం, గ్రౌండ్‌‌లో ప్రాక్టీస్ చేయడం, మా బ్యాచ్‌‌తో కలిసి గ్రూప్ స్టడీ చేయడం ఇదే పని. మా అమ్మ రోజు పని దగ్గరి నుంచి పేపర్ తీసుకొచ్చేది. నైట్‌‌లో కరెంట్ అఫైర్స్ రాసుకున్నా. నాకు ఎక్కువ సేపు కూర్చుని చదవడం నచ్చదు. అలా గంటలపాటు చదవడం నా వల్ల అయ్యేది కాదు. అందుకే రిలాక్సేషన్ కోసం పాటలు వినేదాన్ని. చిన్నప్పటి నుంచి మా కాళ్ల మీద మేము నిలబడాలని చాలా అనుకునేదాన్ని. అమ్మ ఒక్కరే కష్టపడడం చూసి చాలా బాధ వేసేది. పక్కింటివాళ్లు వచ్చి 24గంటలు చదువులేనా, పెళ్లిళ్లు చేసుకోరా అని క్వశ్చన్ చేసేవాళ్లు. అప్పుడు జాబ్ వస్తుందా, రాదా అని భయం వేసేది. వస్తే ముగ్గురికి రావాలని గట్టిగా అనుకునేది. నాతోపాటు, మా అక్కకి, చెల్లెకి రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఫ్యూచర్‌‌‌‌లో ఎస్‌‌ఐ కావాలనేది మా కామన్ డ్రీమ్. ఇప్పుడెలా కష్టపడ్డామో అలాగే కష్టపడతాం కొడతాం..!

కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ లాస్ట్ సెమిస్టర్ రాసేటప్పుడే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఒక టైంలో అటు సెమిస్టర్‌‌‌‌కు, ఇటు కాంపిటీటివ్‌‌కు ప్రిపేరయ్యా. అప్పుడే సుల్తాన్‌‌బజార్ పోలీస్‌‌స్టేషన్‌‌ వాళ్లు పోలీస్ జాబ్‌‌లకు ట్రై చేసేవాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. అప్పటికింకా సైబరాబాద్ కమిషనరేట్ వాళ్లు స్టార్ట్ చేయలేదు. అందుకే కోఠిలోనే కొన్ని కోచింగ్ క్లాసులు విన్నా. మార్నింగ్ వెళ్తే రాత్రి 10వరకు అక్కడే ఉండేదాన్ని. డిగ్రీలో బీఏ తీసుకున్నా కాబట్టి ఫస్ట్ టైమ్ రాసినా ఎక్కడా భయపడలేదు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అన్ని ఇదివరకే చదివినట్టు అన్పిస్తుండే. నేను చిన్నప్పటినుంచి స్పోర్ట్స్‌‌లో ఫస్ట్. కబడ్డీ, రన్నింగ్, ఖోఖో ఇలా ఏది ఆడినా ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. అది ఈవెంట్స్‌‌లో చాలా ప్లస్ అయింది. అందుకే 75మార్కులకు 72 వచ్చాయి. సబ్జెక్టుల్లోనే అరిథ్‌‌మెటిక్ చాలా టఫ్ అన్పించేది. ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్‌‌ చేయాలంటూ తల పట్టుకున్నా. కానీ కోచింగ్ ప్లస్ యూట్యూబ్‌‌ క్లాసులు చాలా ఉపయోగపడ్డాయి. ఇంట్లో అందరికంటే నేనే చిన్నదాన్ని. మమ్మల్ని మా పెద్ద అక్క మౌనిక చాలా మోటివేట్ చేసింది. మా అమ్మ ఒక్కరే కష్టపడుతుంటే మేం ఎందుకు పుట్టినం అన్పిస్తుండే. అయినా పెద్ద అక్క మాటలు విని కష్టపడ్డం జాబ్ కొట్టినం. ఎల్‌‌ఎల్‌‌బీ చేసి లాయర్ అవ్వాలనుకున్నా. కానీ ఇలా కానిస్టేబుల్ అయ్యా. నెక్ట్స్ టార్గెట్   ఎస్‌‌ఐ జాబ్ కొట్టడమే.

Latest Updates