కెనాల్ ను శుభ్రం చేస్తుండగా కూలిన మూడంతస్తుల భవనం

కెనాల్ కు పక్కనే నిర్మిస్తున్న ఓ మూడంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని మిడ్నపూర్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో ఇవాళ(శనివారం,జూన్-13) జరిగింది. బిల్డింగ్ కు ఆనుకుని ఉన్న కెనాల్ ను శుభ్రం చేయడంతో భవనం కూలి కెనాల్ లో పడిపోయింది. కొన్ని రోజులుగా కెనాల్ ను శుభ్రం చేసే పనిని అధికారులు చేపట్టారు. దీంతో రెండు రోజుల క్రితమే బిల్డింగ్ కి పగుళ్లు ఏర్పడటం ప్రారంభమైంది.

మరోవైపు  గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. బిల్డింగ్ పునాదులు కూడా బలహీనంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రభుత్వ భూమిని  ఆక్రమించి, కెనాల్ లోపలి వరకు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Latest Updates