పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కాశ్మీర్‌లో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నలుగురు ఉగ్రవాదులు ఓ వ్యానులో ప్రయాణిస్తుండగా గుర్తించిన భద్రతా సిబ్బంది… నగ్రోటా చెక్‌పోస్టు వద్ద వారిని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, ఉగ్రవాదులు వ్యాన్ ను ఆపకుండా దూసుకెళ్లారు. వెంబడించిన భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా మరో వ్యక్తి తప్పించుకొని అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు.ప్రస్తుతం అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో జమ్ము – కాశ్మీర్‌ హైవేను అధికారులు మూసివేశారు. కాల్పుల ఘటనలో ఒక పోలీసు గాయపడ్డాడు.

Three terrorists killed in encounter on Jammu-Srinagar highway

Latest Updates