శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు, ఓ మహిళ మృతి

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. శ్రీనగర్‌లోని బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఫిర్దౌసాబాద్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కూంబింగ్ నిర్వహించింది. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా ఆర్మీ కూడా ఎదురుకాల్పులకు దిగింది. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కూంబింగ్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందగా.. కౌన్సర్ రియాజ్ అనే మహిళ కూడా మృతి చెందింది. కాగా.. ఈ కాల్పుల్లో ఇద్దరు సిఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని.. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు తెలిపారు.

For More News..

తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మరణాలు

షుగర్ బాధితులు, లావుగా ఉన్నోళ్లకే ఎక్కువ ప్రమాదం

ఉద్యోగం పోయినోళ్లకు నయా జాబ్స్..

Latest Updates