బెంగళూరు నుంచి 22 విమానాలతో 3 వేల మంది విదేశీయుల తరలింపు

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలను విధించింది. దీంతో అనేక తమ సొంత దేశాలకు వెళ్లడానికి వీళ్లేక చాలా మంది విదేశీయులు మన దేశంలోనే ఉండిపోయారు. వీరిలో 3 వేల మందిని వారి దేశాలకు పంపించి వేసినట్టు అధికారులు తెలిపారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి మొత్తం 22 విమానాల ద్వారా 17 దేశాలకు విదేశీయులను తరలించినట్టు ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు.

విదేశీయులతో కూడిన మొదటి విమానం మార్చి 31న జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు వెళ్లిందని అధికారులు తెలిపారు. ఈ విమానంలో వెళ్లిన వారిలో ఎక్కువ మంది టోక్యోకు చెందినవారు ఉన్నారన్నారు. లండన్, మాలె, మస్కట్, దోహా, కొలంబో, కైరో, బాగ్దాద్, ఇంచేన్, రోమ్, స్టాక్ హోమ్, రియాద్, పారిస్,పెరూ,అజర్ బైజాన్ నగరాలకు విమానాలు వెళ్లాయన్నారు. వీటిలో ఇంచేన్, రోమ్, పెరూ, కైరో, బాగ్దాద్, అజర్ బైజాన్, స్టాక్ హోమ్ నగరాలకు బెంగళూరు నుంచి  మొదటి సారిగా విమానాలు నడిచాయని చెప్పారు.

Latest Updates